BSNL యొక్క అన్లిమిటెడ్ FTTH ప్లాన్స్ ఇప్పుడు రోజు వారి డేటాతో వస్తాయి

Updated on 11-Feb-2019
HIGHLIGHTS

ఒకేసారి మొత్తం డేటా అందించిన అన్లిమిటెడ్ FTTH ప్రణాళికలో మార్పులు చేసి, రోజువారీ పరిమితికి మార్చిన BSNL.

గత నెలలో,  ప్రభుత్వ టెలికం సంస్థ అయిన, బిఎస్ఎన్ఎల్ దాని భారత్ ఫైబర్ సర్వీసును ప్రకటించింది, ఇది ప్రాథమికంగా ఈ తేలికో కేబుల్ ఉపయోగించకుండా, ఇంటర్నెట్ సేవను అందించడానికి ఫైబర్ కి మారినట్లు ప్రకటించింది. ప్రస్తుతం, గృహ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు రోజువారీ డేటాను అందిస్తున్నందున, ఈ సేవను పొందటానికి వినియోగదారుడు ఎంచుకునే విధంగా, అపరిమిత ఇంటర్నెట్ ప్లాన్లకు  ఈ ప్రభుత్వ-రంగ టెలికాం కొన్ని కొత్త మార్పులను చేసింది. అలాగే, ప్రణాళికల పేర్లు కూడా మార్చబడ్డాయి మరియు ఇకపై ఫైబ్రో కాంబో నేమింగ్ కన్వెన్షన్ లేదు. ఈ కొత్త మార్పులు సంస్థ యొక్క ప్రస్తుత FTTH ప్యాక్ల కోసం తయారు చేయబడ్డాయి మరియు మరొక కొత్త ప్లాన్ కూడా ఇందులో కొత్తగా చేర్చారు.

BSNL, ఫిబ్రో కాంబో ULD 777 పేరును 18GB ప్లాన్ గా పేరు మార్చింది మరియు పేరు సూచించినట్లుగా, రోజుకి 50Mbps వేగంతో ఒకరోజు కోసం 18GB వాడకం వరకు ఇదే స్పీడ్ అందిస్తుంది. దీని తరువాత, ఇది 2Mbps స్పీడుకు పరిమితం చేయబడుతుంది. ఈ ప్లాన్, రూ. 777 ధరతో ఉంటుంది మరియు ఒకే 500GB డేటాను అందిస్తుంది, కానీ ముందుగా మొత్తం డేటాను ఒక్కసారిగా మాత్రమే పొందడానికి ఉండేది, అది ఇప్పుడు వినియోగదారుకు ప్రతిరోజూ కేటాయించబడుతుంది. తర్వాత అప్గ్రేడ్ చేయబడిన ఫైబ్రో కాంబో ULD 1277 ప్రణాళిక ఇప్పుడు 25GB ప్రణాళికగా మార్చబడింది మరియు 100Mbps వేగంతో వినియోగించగల 25GB రోజువారీ డేటాతో వస్తుంది. పరిమితి ముగిసిన తరువాత, ఒక 2Mbps స్పీడుకు తగ్గించబడుతుంది.

అప్డేట్ చేయబడిన BSNL యొక్క అన్లిమిటెడ్ FTTH ప్రణాళికలు

పైన చుసిన విధంగా, బిఎస్ఎన్ఎల్ ఒక కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఇది 100Mbps వేగంతో లభ్యమయ్యే రోజువారీ 40GB డేటాతో వస్తుంది ఈ 40GB ప్లాన్ గా పిలవబడుతుంది, ఈ హై స్పీడ్ డేటా పరిమితి ముగిసిన తరువాత,  2Mbps వరకు డౌన్ లోడ్ వేగం తగ్గించబడుతుంది. ఈ కొత్త ప్లాన్ రూ 2,499 ధరతో వస్తుంది. అలాగే, 50GB, 80 GB ప్లాన్, 120 GB ప్లాన్ మరియు 170 GB ప్లాన్ వరుసగా రోజుకు 50GB, 80GB, 120GB మరియు 170GB డేటాను అందిస్తుంది. 50GB ప్లాన్ మరియు 80GB ప్లాన్స్ వరుసగా రూ. 3,999 రూపాయలకు మరియు రూ .5,999, మరియు వరుసగా 60 మరియు 70Mbps వరకు వేగం అందిస్తున్నాయి. FUP పరిమితి ముగిసిన తరువాత, వీటి వేగం 4Mbps మరియు 6Mbps కు తగ్గించబడుతుంది. 120GB మరియు 170GB ప్లాన్స్ పేర్కొన్న FUP వరకు 100Mbps స్పీడ్ తో వస్తాయి మరియు వాటి ధర రూ .9,999 మరియు రూ .16,999 గా ఉంటాయి. రోజువారీ డేటా లిమిట్ వాడుకున్న తరువాత , 8 మరియు 10 Mbps వేగాలను పొందవచ్చు అన్లిమిటెడుగా పొందవచు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :