చూస్తుంటే BSNL తన పోర్ట్ ఫోలియో నుండి 5 STV ప్లాన్లను తొలగించినాట్లు కనబడుతోంది. స్పెషల్ టారిఫ్ ప్లాన్ (STV) అయినటువంటి, Rs 333 ప్లాన్, Rs 339 ప్లాన్, Rs 379 ప్లాన్, Rs 392 ప్లాన్ మరియు Rs 444 ప్లాన్లను BSNL తన పోర్ట్ ఫోలియో నుండి తొలగించినట్లు ముందుగా Telicom Talk తన నివేదికలో పేర్కొంది.
ఈ Rs 333 ప్లాను అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజువారీ 3GB డేటా అందిస్తోంది. అధనంగా, దీనితో Eros సబ్ స్క్రిప్షన్ మరియు 45 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అలాగే, Rs 339 STV ప్లాన్ డైలీ ఇతర నెట్వర్కులకు 30 నిముషాల STD కాలింగుతో పాటుగా, డైలీ 3GB డేటా తో వస్తుంది, కానీ ఇది కేవలం 26 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
అలాగే, Rs 379 ప్లానుతో రోజుకు 4GB డాటాతోపాటుగా డైలీ ఇతర నెట్వర్కులకు 30 నిముషాల STD కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. అయితే,, ఇది కేవలం 30రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ Rs 392 STV ప్లాన్ విషయానికి వస్తే, నెట్వర్క్ పరిధిలో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 3GB డేటా అందిస్తుంది. దీనితో పాటుగా Eros Now సబ్ స్క్రిప్షన్ మరియు BSNL గేమింగ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది.
ఇక చివరిదైన Rs 444 STV ప్లాన్ గురించి చూస్తే, ఇది వినియోగదారులకి రోజుకు 4GB దాటని అందిస్తుంది. అలాగే, నెట్వర్క్ పరిధిలో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు Eros Now సబ్ స్క్రిప్షన్ తో పాటుగా 60 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే Telicom Talk ప్రకారం, ప్రస్తుతం అనేకమైన అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లను అందిస్తుండగా, కేవలం 30 నిముషాల కాలింగ్ పరిధితో వర్తించే ఈ ప్లాన్లను కొనసాగించడం అవసరంలేదని, అందుకోసమే ఈ 5 STV ప్లాన్లను తొలగించాల్సివస్తుందని BSNL తెలిపినట్లు తెలియవచ్చింది.