BSNL బెస్ట్ అఫర్: 107 ఖర్చుతో 40 రోజులు ఆనందించండి.!

BSNL బెస్ట్ అఫర్: 107 ఖర్చుతో 40 రోజులు ఆనందించండి.!
HIGHLIGHTS

BSNL బెస్ట్ అఫర్: 107 ఖర్చుతో 40 రోజులు ఆనందించండి

ఇంత తక్కువ ధరకే ఎక్కవ వ్యాలిడిటీ అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీ BSNL

BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకోండి

BSNL బెస్ట్ అఫర్: 107 ఖర్చుతో 40 రోజులు ఆనందించండి. అంతేకాదు, ఇంత తక్కువ ధరకే ఎక్కవ వ్యాలిడిటీ అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీ కూడా BSNL మాత్రమే. BSNL అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో ఈ Rs.107 ప్లాన్ మంచి ప్రయోజాలను అందించే బెస్ట్ ప్లాన్ అని చెప్పొచు. ఈ ప్లాన్ తో వినియోగదారులు 40 రోజులు కాలింగ్ మరియు డేటా ప్రయోజాలను పొందవచ్చు. BSNL అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకోండి.  

BSNL Rs.107 Plan: 

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో రూ.107 ప్లాన్ కూడా ఒకటి. ఈ ప్లాన్ కేవలం 107 రూపాయలకే 40 రోజుల వ్యాలిడిటీని మీకు అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 200 మినిట్స్ ఉచిత కాలింగ్ మినిట్స్ ను కూడా అందిస్తున్నది. అలాగే, 40 రోజుల ఉచిత BSNL ట్యూన్స్ ని కూడా మీరు పొందుతారు. అంతేకాదు, పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 3GB డేటా కూడా అందుతుంది. ఈ ఫ్రీ బైస్ ముగిసిన తరువాత మీకు కాల్ మరియు డేటా రేట్లు వర్తిస్తాయి. 

BSNL వినియోగదారులకు మరిన్ని లాభాలను అతి తక్కువ ధరలో అందించే మరొక బెస్ట్ ప్లాన్స్ కూడా వుంది. అదే BSNL యొక్క రూ.397 ప్లాన్. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.       

BSNL రూ.397:

పైన తెలిపి అఫర్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా BSNL తన కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.  ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి 180 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo