BSNL STV 187 రీచార్జీతో రోజుకు 6.2GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్
ముంబాయి మరియు ఢిల్లీ వంటి నెట్వర్కులకు కూడా రోమింగ్ మరియు కాలింగ్ అవకాశాన్ని అందించింది.
ప్రభుత్వరంగ టెలికం సంస్టయినటువంటి BSNL, తన వినియోగదారులు మంచి ఆఫర్లను అందించడంలో ఇప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది. ఉచిత డేటాని అందించడంలో జియో ముందుండగా, తాను కూడా తక్కువేమి కాదని BSNL నిరుపించుకుంటోంది. ముందుగా, కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన జులై వరకు అందించిన ఉచిత డైలీ 2.2 GB డేటా ప్లాన్ను అక్టోబర్ నెల వరకూ పొడిగించగా, మరికొన్ని STV ప్లాన్స్ పైనా కూడా అత్యధికమైన డేటాని అఫర్ చేస్తోంది.
ప్రస్తుతం, ఈ STV 187 రీచార్జీతో అత్యధికంగా రోజుకు 6.2 GB డేటాని ఇస్తుండడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే. అలాగే, దీని పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లను కూడా అందిస్తోంది. అయితే, ముందుగా ఈ స్పెషల్ రీచార్జీతో 4GB డేటాని అందించేది. అలాగే, ఈ ప్లానుతో, ముంబాయి మరియు ఢిల్లీ వంటి నెట్వర్కులకు కూడా రోమింగ్ మరియు కాలింగ్ అవకాశాన్ని అందించింది. అయితే, ఈ ప్లాన్ కేవలం 28 రోజుల చెల్లుబిటుతో వస్తుంది.
ఇక పైన తెలిపినట్లుగా, ఈ క్రింది ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన డైలీ 2.2 GB అధిక డేటాని అక్టోబర్ 1 వ తేదీ వరకూ పొడిగించింది.
1. Rs 186 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.2GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 28 రోజుల వ్యాలిడిటీ.
2. Rs 429 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.2GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 81 రోజుల వ్యాలిడిటీ.
3. Rs 485 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.7GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 90 రోజుల వ్యాలిడిటీ. అయితే, ముందుగా రోజువారీ 1.5GB దాటని అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను కూడా ఈ అదనపు డేటా ప్రయోజన జాబితాలోకి తీసుకొచ్చింది BSNL.
4. Rs 666 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.7GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 129 రోజుల వ్యాలిడిటీ.
5. Rs 1699 ప్రీపెయిడ్ ప్లాన్
BSNL యొక్క వార్షిక Rs.1699 ప్లాన్ తో, లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, రోజువారీ 100SMS లు మరియు రోజువారీ 2GB డాటాతో మొత్తంగా 730GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క FUP పరిమితిని దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ప్రస్తుత ప్రకటనతో దీని యొక్క రోజువారి డేటా 2GB నుండి 4.2GB కి చేరుకుంది. అంటే, ఈ ప్లాను ద్వారా ఇపుడు రోజువారీ 4.2 GB డేటాని వాడు