టెలికాం ఇండస్ట్రీలో అత్యంత చవకైన ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న BSNL
టెలికాం ఇండస్ట్రీలో అత్యంత చవకైన ప్రీపెయిడ్ ప్లాన్
నెలకు రూ. 100 రూపాయల ఖర్చుతోనే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందుకోవచ్చు
బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్
టెలికాం ఇండస్ట్రీలో అత్యంత చవకైన ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న టెలికాం కంపెనీగా BSNL నిలుస్తుంది. ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఎంత చవక అంటే కేవలం నెలకు రూ. 100 రూపాయల ఖర్చుతోనే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందుకోవచ్చు. చవక ధరలో వచ్చినా కూడా ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. అంటే, కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు చూద్దాం పదండి.
ఏమిటా BSNL చవకైన వన్ ఇయర్ ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ చాలా కాలంగా ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ను ఆఫర్ చేస్తూ వస్తోంది. అదే. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,199 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు, అంటే పూర్తిగా ఒక సంవత్సరం వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
బిఎస్ఎన్ఎల్ రూ. 1,199 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,199 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నెల నెల ప్రయోజనాలు 12 నెలల పాటు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు నెలకు 300 మినిట్స్ కాలింగ్, 3GB డేటా మరియు 30 SMS లు చొప్పున 12 నెలల పాటు అందిస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అమౌంట్ ను 122 నెలకు విభజిస్తే నెలకు కేవలం రూ. 100 రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 1,199 ప్లాన్ నార్మల్ కాలింగ్ మరియు తక్కువ డేటా ఉపయోగించే వారికి సరిపోతుంది. ముఖ్యంగా, చవక ధరలో సంవత్సరం మొత్తం మొబైల్ నెంబర్ ను కొనసాగించడానికి చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
Also Read: కంప్లీట్ సెటప్ 5.2.2 ఛానల్ Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ఫ్రీ బైస్ ముగిసిన తర్వాత లోకల్ కాల్ కోసం Rs 1/min, STD కాల్స్ కోసం రూ. 1.3/min, Local SMS కోసం 80p, నేషనల్ SMS కోసం రూ. 1.20/SMS మరియు 1 MB డేటా కోసం 25p ఛార్జ్ చేస్తుంది.
మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here