HIGHLIGHTS
బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు చెల్లించే మొత్తంలో 25% క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తోంది.
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయినటువంటి, BSNL సరికొత్త ప్యాకేజీలను అందించడమే కాకుండా ప్రయివేటు బ్రాడ్ బ్యాండ్ సంస్థలకు పోటీగా నిలుస్తుంది. ఇప్పటి వరకు అనేక ప్రణాళికలను ప్రకటించిన BSNL, ఇప్పుడు మరొక ప్రకటించిన కొత్త ఆఫరుతో మరొక మెట్టెక్కింది. బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు చెల్లించే మొత్తంలో 25% క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తోంది.
అయితే, ఈ అఫర్ అందరికి నేరుగా అందించడలేదు, కేవలం ఆన్లైన్లో BSNL బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ నుండి ఇంటర్ నెట్ కి కనెక్ట్ చెయ్యగానే, మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపించే 25% స్కీమ్ ద్వారా దీనిని ఎంచుకున్నవారికి మాత్రం వర్తిస్తుంది. అంతేకాదు, ఈ ఆఫరును పొందడం కోసం ఒక సంవత్సరం ప్లాన్స్ తో మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ అఫర్ వర్తిస్తుంది.
ఈ అఫర్ ఎలా పొందాలి ?
- ఆన్లైన్లో BSNL బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ నుండి ఇంటర్ నెట్ కి కనెక్ట్ చెయ్యాలి
- ఇప్పుడు మీ మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపించే 25% స్కీమ్ పైన నొక్కండి
- ఇక్కడ మీ సర్వీస్ ID మరియు CAPTCHA ని ఎంటర్ చేసి OTP కోసం ఎంచుకోండి
- ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుపైన OTP అందించబడుతుంది
- మీకు వచ్చిన OTP ఎంటర్ చేసిన తరువాత Validate చేయండి
- ఇక్కడ మీకు స్క్రీన్ పైన 25% క్యాష్ బ్యాక్ తో అందుబాటులో ఉన్నటువంటి యాన్యువల్ ప్లాన్స్ కనిపిస్తాయి
- ఇక్కడ మీకు నచ్చిన ప్లాన్‌ని ఎంచుకొని సబ్మిట్ చేయండి తెసివేయాలంటే క్యాన్సిల్ పైన నొక్కండి
ఈ ఆఫరుతో పాటుగా కొన్ని షరతులను కూడా విధించింది అవి :
- మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రాసెస్ లోవుంటే, కొత్త అభ్యర్ధన చెయ్యలేరు
- వినియోగదారులు నెలకొకసారి మాత్రమే ప్రణాళికలో మార్పులు చేసుకొనే అవకాశం
- ముఖ్యంగా, మీకు అందించే క్యాష్ బ్యాక్ మొత్తం కూడా మీరు ఎంచుకున్న ప్లాన్ బిల్లింగ్ జరిగిన తరువాతనే క్రెడిట్ చేయడం జరుగుతుంది.
- ఈ క్రెడిట్ చేసిన మొత్తాన్ని BSNL యొక్క సర్వీసులకు సంబంధిచిన బిల్స్ కోసం వాడుకునేలా అందచేస్తుంది.
ఈ ఆఫరు కోసం BSNL ఈ http://www.bsnl.co.in/opencms/bsnl/BSNL/services/landline/cashback_offer పేజీలో చూడవచ్చు.