అన్ని టెలికం సంస్థలు కూడా తమ ప్రస్తుత అనిశ్చితి నుండి గట్టెక్కడానికి, తమ రేట్లను పెంచడానికి సిద్ధమవుతుంటే, ప్రభుత్వ టెలికం సంస్థ ఈవంటివంటి BSNL మాత్రం, దూకుడు మీద కనిపిస్తోంది. ఇప్పటి వరకు అందించిన ప్రీపైడ్ ప్లాన్లతో పాటుగా ఒక కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ను అదికూడా ఎటువంటి పరిమితి లేకుండా పూర్తిగా అన్లిమిటెడ్ ప్రయోజనాలతో తెచ్చింది. ఈ ప్లానుతో రీఛార్జ్ చేస్తే డైలీ లిమిట్ లేదు ఎంతైనా డేటా వాడుకోండి మరియు అన్లిమిటెడ్ కాలింగ్ పూర్తిగా ఉచితం, అని కూడా చెబుతోంది.
BSNL ఈ కొత్త ప్లాన్ను, రూ. 1098 రూపాయల ధరతో ప్రకటించింది. అయితే, ఈప్లానుతో రీఛార్జ్ చేసేవారికి ఎటువంటి క్యాపింగ్ లేకుండా డేటా వాడుకునేలా అందించింది మరియు దీనితో ఎటువంటి పరిమితులు లేని విధంగా ఇతర నెట్వర్కులకు కూడా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే, పూర్తిగా అన్లిమిటెడ్ ప్రయోజనాలతో ఒక ప్రీపెయిడ్ ప్లాన్ను మారె ఇతర నెట్వర్కు కూడా ఇప్పటి వరకు అందించలేదు. అయితే, ఇందులో నిరుత్సాహ పరిచే విషయం ఒకటుంది. అదేమిటంటే, ఈ ప్లాన్ అన్ని అన్లిమిటెడ్ ప్రయోజనాలతో వచ్చిన కూడా కేవలం 84 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే రావడం కొంత నిరాశ కలుగుతుంది.
ఈ వార్తను ముందుగా టెలికాం టాక్ అందించింది. ఈ ప్లాన్ను కేవలం అన్ని ప్రయోజనాలను ఎటువంటి క్యాపింగ్ లేకుండా పూర్తి స్వేచ్ఛతో వాడుకునే వారికోసం అందించినట్లు తెలిపింది. అయితే, ఈ రీఛార్జ్ చేసే ముందుగా మీ సర్కిల్లో ఈ అఫర్ అందుబాటులో ఉందొ లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే, పైన తెలిపిన డేటా మరియు కాలింగ్ ప్రయోజనాలతో పాటుగా, డైలీ 100SMS మరియు మీకు నుంచి రింగ్ బ్యాక్ ట్యూన్ PRBT (పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ ఫెసిలిటీ) కూడా ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి మీకు ఉచితంగా లభిస్తుంది.