గత కొద్దికాలంగా, BSNL తన సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లతో వినియోగదారులకు ఆశ్చర్యచకితులను చెయ్యడంతో పాటుగా ఇతర ప్రధాన టెలికం సంస్థలకు కూడా గట్టి పోటీని ఇస్తోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముందుగా, 2.1GB ల అధిక ఉచిత డేటాని అందించిన ఈ ప్రభుత్వ టెలికం సంస్థ, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన రెండు డేటా ప్లాన్లతో అతితక్కువ ధరకే 1GB అదీకూడా 4G హై స్పీడ్ డేటాని అఫర్ చేస్తున్న ఏకైక సంస్థగా కూడా నిలుస్తుంది.
ప్రస్తుతం,BSNL ప్రకటించిన రెండు కొత్త 4G డేటా ప్లాన్లతో ఇతర టెలికం సంస్థలకు ముచ్చెమటలు పట్టించనుంది. ఈ ప్లాన్లను, రూ.96 మరియు రూ. 236 ధరలతో ప్రకటించింది. అయితే, ఈ రెండు ప్లాన్లు కూడా వినియోగదారులకు రోజుకు 10GB హై స్పీడ్ డేటాతో ప్రకటించడం ఇందుకు కారణం అని చెప్పొచ్చు. ఈ ప్లాన్లను BSNL 4G సేవను అందిస్తున్నటువంటి, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా, కేరళ, కలకత్తా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, చెన్నై మరియు తమిళనాడు వంటి సర్కిళ్లలో ప్రకటించింది.
ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల విషయానికి వస్తే, వీటిలో రూ.96 డేటా ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఇది డైలీ 10GB డేటాని అందిస్తుంది. అంటే, పూర్తి 28 రోజులకు గాను రోజుకు 10GB డేటాతో మొత్తంగా 280GB ల హై స్పీడ్ డేటాతో వస్తుంది. డేటా అధికంగా అవసరమున్న వినియోగదారుకు ఈ ప్లాన్ నిజంగా ఒక వరమే అవుతుంది. ఇక ఈ 280GB ల డేటాని 96 రూపాయలతో విభజించి చూస్తే, 1GB కి కేవలం 29.1 పైసలు మాత్రమే అవుతుంది.
ఇక రూ.236 రుపాయల డేటా ప్లాన్ విషయానికి వస్తే, ఇది 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే, మరియు ఇది పూర్తి 84 రోజులకు గాను గరిష్టంగా 2,360GB ల హై స్పీడ్ డేటాతో వస్తుంది. డేటా అధికంగా అవసరమున్న వినియోగదారుకు ఈ ప్లాన్ నిజంగా ఒక వరమే అవుతుంది. ఈ ప్లాన్లతో పోల్చి చూస్తే, ప్రధాన 4G టెలికం సంస్థలనటువంటి, జియో మరియు ఎయిర్టెల్ వంటి సంస్థల డేటా ప్లాన్లకు ఇది ఘోరమైన పోటీని ఇస్తుంది.
అయితే, జియో మరియు ఎయిర్టెల్ వంటి సంస్థల యొక్క డేటా స్పీడ్ తో పోలిస్తే మాత్రం BSNL యొక్క 4G స్పీడ్ కొంత తక్కువగా ఉంటుంది. కానీ, ఎక్కువ డేటాని అందించే ప్లాన్లలో మాత్రం ఈ రెండు ప్లాన్లు కూడా ముందు వరుసల్లో నిలవడం మాత్రం ఖాయం.