BSNL LIVE TV: యూజర్ల కోసం కొత్త టీవీ సర్వీస్ తెచ్చిన బిఎస్ఎన్ఎల్.!
బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ సేవలు తీసుకు వచ్చే పనిలో వుంది
తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ సర్కిల్స్ లి టెస్టింగ్ చేస్తోంది
బిఎస్ఎన్ఎల్ ఈ సర్వీస్ ను ‘First In India’ అని పిలుస్తోంది
BSNL LIVE TV: ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్స్ మరియు 4G నెట్ వర్క్ విస్తరణతో రోజూ వార్తల్లో నిలుస్తోంది. అయితే, ఈరోజు మరొక కొత్త ప్రకటనతో వార్తల్లోకి ఎక్కింది. దేశంలో బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ సేవలు తీసుకు వచ్చే పనిలో ఉన్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ప్రస్తుతం ఈ సర్వీస్ టెస్టింగ్ దశలో వుంది. బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ సర్వీస్ ను తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ సర్కిల్స్ లి టెస్టింగ్ చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ ఈ సర్వీస్ ను ‘First In India’ అని పిలుస్తోంది.
BSNL LIVE TV
బిఎస్ఎన్ఎల్ కొత్త ప్రకటించిన ఈ కొత్త లైవ్ టీవీ సర్వీస్ లను కేవలం బిఎస్ఎన్ఎల్ FTTH (ఫైబర్ టు హోమ్) సర్వీస్ పైన మాత్రమే అందిస్తుంది. అందుకే ఈ కొత్త సర్వీస్ ను ఫస్ట్ ఇన్ ఇండియా అని గొప్పగా చెబుతోంది. అదేంటి, ఇప్పటికే Jio Tv+ ఉంది కదా ఈ బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఎలా మొదటిది అవుతుందని మీకు డౌట్ రావచ్చు. అయితే, ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం వుంది. ఈ వ్యత్యాసం కారణంగానే ఈ బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ ఈ కేటగిరిలో మొదటిది అవుతుంది.
బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ మొదటిది ఎందుకు అవుతుంది?
బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ మొదటిది ఎందుకు అవుతుంది అంటే, ఇది పూర్తిగా FTTH పై నడుస్తుంది. అయితే, జియో టీవీ ప్లస్ మాత్రం మాత్రం పూర్తిగా HLS ఆధారిత స్ట్రీమింగ్ పై నడుస్తుంది. ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం వుంది. జియో టీవీ ప్లస్ అనేది ఇంటర్నెట్ ప్లాన్ పై ఆధారపడి నడుస్తుంది మరియు ఇంటర్నెట్ స్పీడ్ ను బట్టి కంటెంట్ క్వాలిటీ మారుతుంది.
అయితే, బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ మాత్రం ఎటువంటి ఎగ్జిస్టింగ్ ప్లాన్ తో పని లేకుండా నడుస్తుంది. అంతేకాదు, ఇంటర్నెట్ వేగంతో పనిలేకుండా సాఫీగా స్ట్రీమింగ్ అవుతుంది. అందుకే, ఇది ఈ విధానంలో మొదటిది అని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.
Also Read: Motorola razr 50 Ultra పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్ ఇండియా.!
వాస్తవానికి, బిఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్ ఫామ్ పై మాత్రమే అందుబాటులో ఉంది. ఇది లైవ్ టీవీ ఛానల్స్ తో వస్తుంది. ఈ సర్వీస్ ను పొందడానికి FTTH కనెక్షన్ పొందిన మొబైల్ నెంబర్ తో OTP అందుకొని లాగిన్ అవ్వొచ్చు.