BSNL: టెలికాం రంగంలో సెగలు పుట్టించే ప్లాన్ లాంచ్ చేసిన ప్రభుత్వ టెలికాం.!

BSNL: టెలికాం రంగంలో సెగలు పుట్టించే ప్లాన్ లాంచ్ చేసిన ప్రభుత్వ టెలికాం.!
HIGHLIGHTS

ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ చవక రేటుకే గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది

తక్కువ ఖర్చుతో యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలను అందించే సరికొత్త ప్లాన్

ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ భారీ కాంపిటీషన్

BSNL: అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా టారిఫ్ రేట్లు పెంచేస్తున్న సమయంలో ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ మాత్రం చాలా చవక రేటుకే గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, హై స్పీడ్ డేటా మరియు మరిన్ని ఇతర లాభాలను లాంగ్ పీరియడ్ సమయానికి అందిస్తుంది. ఈ ధరలో ఇప్పటి వరకు ఏ టెలికాం అందించని విధంగా ఈ ప్రీపెయిడ్ ను తీసుకు వచ్చింది.

ఏమిటా BSNL కొత్త ప్లాన్?

తక్కువ ఖర్చుతో యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలను అందించే ఉద్దేశ్యంతో బిఎస్ఎన్ఎల్ సరికొత్తగా అందించిన రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ ను 160 నెలల లాంగ్ వ్యాలిడిటీ తో అందించింది.

బిఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్ అందించే లాభాలు ఏమిటి?

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 997 చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 5 నెలలు (160 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 2GB హై స్పీడ్ డేట్ లభిస్తుంది మరియు ఈ లిమిటెడ్ డేటా ముగిసిన తర్వాత 40kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేట్ లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 100 SMS ఉపయోగ సౌలభ్యం కూడా లభిస్తుంది.

bsnl new Rs.997 Prepaid Plan

ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, గేమియం ప్రీమియం అప్లికేషన్, హార్డీ గేమ్స్, చాలెంజర్స్ ఆఫ్ అరేనా గేమ్స్, గేమ్ ఆన్ మరియు ఆస్ట్రోటెల్ , Lystn పోడ్కాస్ట్, జింగ్ మ్యూజిక్ మరియు wow ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Also Read: పవర్ ఫుల్ సౌండ్ అందించే రెండు కొత్త Soundbar లను లాంచ్ చేసిన Honeywell

జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ భారీ కాంపిటీషన్ గా నిలుస్తుంది. ఇప్పటికే 4జి నెట్ వర్క్ ను వేగంగా నిర్మించడానికి బిఎస్ఎన్ఎల్ కృషి చేస్తోంది మరియు దేశం మొత్తం త్వరలోనే 4జి సేవలు తెస్తుందని కూడా తెలిపింది. 4జి నెట్ వర్క్ దేశం మొత్తం విస్తరించి ఇటివంటి బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తే ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గడ్డుకాలం ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు రీఛార్జ్ చేయడానికి Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo