BSNL యూజర్లకు శుభవార్త : BSNL మొబైల్ టీవీ లాంచ్

BSNL యూజర్లకు శుభవార్త : BSNL మొబైల్ టీవీ లాంచ్

Jio, Airtel, Vodafone, వంటి చాలా నెట్‌వర్క్ ప్రొవైడర్లు వినియోగదారులకు వారి స్వంత OTT ప్లాట్‌ ఫామ్‌ లకు యాక్సెస్ ని ఇస్తున్నారు. జియోలో జియోటివి, ఎయిర్టెల్ కు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వొడాఫోన్‌ కు వోడాఫోన్ ప్లే ఉన్నాయి. ఇటువంటి వాటిని వలన ఈ ప్లాట్‌ ఫామ్‌ ల పెరుగుదలను సాధించాయి. ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు బిఎస్‌ఎన్‌ఎల్ టివిని అందించడం ప్రారంభించింది. అయితే, ప్రస్తుతానికి ఈ సేవ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఈ సేవ ఎందుకు అందుబాటులో లేదు అనే విషయాన్ని మాత్రం ఇంకా స్పష్టంగా చెప్పలేదు. స్పెషల్ టారిఫ్ వోచర్స్ (ఎస్‌టివి) – ఎస్‌టివి 97, ఎస్‌టివి 365, ఎస్‌టివి 399, ఎస్‌టివి 997, ఎస్‌టివి 998 మరియు ఎస్‌టివి 1999 లను ఎంచుకునే వినియోగదారులకు బిఎస్‌ఎన్‌ఎల్ టివి అందుబాటులో ఉంది. ఈ సేవ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.  ప్లే స్టోర్‌లో, ఈ అప్లికేషన్ 6.2MB డౌన్‌లోడ్ పరిమాణాన్ని కలిగి ఉంది మరియు ఇప్పటికే 100,000 కంటే ఎక్కువ ఇన్‌స్టాల్స్ చెయ్యబడింది. ఈ అప్లికేషన్ వెర్షన్ 1.0.1.3.

ఈ బిఎస్‌ఎన్‌ఎల్ టివి సర్వీస్  పంజాబీ, భోజ్‌పురి, రాజస్థానీ, హిందీ, ఒడియా, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, హర్యానవిలలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మరియు హిందీ డిఫాల్ట్ అని మీరు అనుకుంటే, ఇంగ్లీష్ మరియు హిందీలలో ఈ సేవ అందుబాటులో లేదని  కామెంట్స్ లో చెప్పబడింది. ప్లే స్టోర్‌లో దీనిగురించి ఇలా ఉంది, “హాయ్ .. దయచేసి కొన్ని పాయింట్లను మెరుగుపరచండి 1. ఈఅప్లికేషన్ కు హిందీ లేదా ఆంగ్ల భాష లేదు 2. 3 లేదా 4 దాని పనిని ఏదో రిఫ్రెష్ చేసిన తర్వాత చాలా నెమ్మదిగా లోడింగ్ ఉంటాయి. 3. సెట్టింగులలో మార్పు భాష పై క్లిక్ చేయలేరు. టెక్స్ట్ బాక్స్ కూడా లేదు, ఈ మార్పు భాషా ఎంపిక అని సూచిస్తుంది. 4. నోటిఫికేషన్‌ లను తెరవడం సాధ్యం కాదు. 5. నా ప్రామాణికతను చూడలేకపోయాను. ”

పై కామెంట్స్ నుండి, ఈ సేవ బీటాలో లేదా కొంత ప్రారంభ యాక్సెస్ తో ఉన్నట్లు కనిపిస్తోంది మరియు కాలక్రమేణా ఇది ఆశాజనకంగా మెరుగుపడుతుంది కావచ్చు.

మీ Android స్మార్ట్‌ ఫోనులో ఈ BSNL TV ఆప్ ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ క్రింద ఉంది.

1. మొదట, యాప్ Android 5.1.2 & అంతకంటే ఎక్కువ వెర్షన్ లలో పని చేస్తుందని తెలుసుకోండి. ముఖ్యంగా, మరింత స్పష్టంగా, ఖచ్చితంగా చెప్పాలంటే మీరు BSNL చందాదారుడు – అదీకూడా ప్రీపెయిడ్ చందాధారుడై ఉండాలి.

2. మీరు పైన తెలిపిన STV ప్లాన్లలో ఒకదానితో రీఛార్జ్ చేయాలి.

3. విజయవంతంగా రీఛార్జ్ చేసిన తర్వాత, మీరు యూజర్ పేరు & OTP తో SMS అందుకుంటారు. OTP పాస్‌వర్డ్ వలె పనిచేస్తుంది. సాధారణంగా, మొబైల్ నంబర్ లాగిన్ కోసం వినియోగదారు పేరు ఉండాలి.

4. మీ మొదటి లాగిన్‌ లో, మీరు పాస్‌ వర్డ్‌ ను మార్చగలరు. భాషను ఎంచుకోండి మరియు మీరు ముందుకు సాగండి.

మూలం

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo