ఏకంగా 2000 GB ల హై స్పీడ్ డేటా ప్లాన్ను ప్రకటించిన BSNL
ప్రైవేట్ టెలికాం కంపెనీలకు నేరుగా పోటీగా నిలవనున్నదని చెప్పొచ్చు.
ప్రభుత్వ టెలికాం సంస్థ అయినటువంటి BSNL తన వినియోగదారుల కోసం కొత్త ఆఫర్ లేదా ప్లాన్లను ఎప్పటికప్పుడు కొత్తగా అందిస్తోంది మరియు ఈరోజుకూడా ఒక కొత్త ప్లాన్ ప్రారంభించింది. కంపెనీ తన వినియోగదారులను ఆకర్షించడానికి ఎటువంటి అవకాశాన్ని వదులుకోవడంలేదని కూడా చెప్పవచ్చు. ఇటీవల కంపెనీ తన 4G నెట్‌వర్క్‌ను కొన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించించిన విషయం తెలిసిందే. అంటే త్వరలో బిఎస్‌ఎన్‌ఎల్ కేవలం 4G సేవలతో అమర్చబోతోందని మరియు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు నేరుగా పోటీగా నిలవనున్నదని చెప్పొచ్చు.
ఇప్పుడు, భారత్ ఫైబర్ కింద బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ గా ప్రవేశపెట్టబడింది. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ఈ ప్లాన్ను రూ .2,999 ధరతో లాంచ్ చేశారు. ఈ ప్లాన్ లో యూజర్లు సుమారు 2000GB డేటాని అంటే 2 TB డేటాని 100Mbps వేగంతో పొందుతారు. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ తో రూ .999 రుపాయల ధరగల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా తమ వినియోగదారులకు అందిస్తోంది.
పైన చెప్పినట్లుగా, ఈప్లానుతో మీరు 2TB ను పొందుతారు, అంటే రూ .29999 ధరలో 100Mbps వేగంతో 2000GB డేటా అన్నమాట. ఇది కాకుండా, ఏదైనా నెట్‌వర్క్ కు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. మీరు డేటాను మాత్రమే కాకుండా ఈ ప్లాన్ తో కాల్ చేయడం వంటి ప్రయోజనం కూడా పొందవచ్చు.
అయితే, బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రస్తుతానికి చెన్నై మరియు తమిళనాడు సర్కిళ్లలో మాత్రమే మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ఇతర సర్కిళ్లలో ఈ ప్లాన్ గురించి ఏమీ చెప్పనప్పటికీ, కంపెనీ ఖచ్చితంగా ఈ ప్లాన్ను అతి త్వరలోనే ఇతర సర్కిళ్లలో కూడా తీసుకువస్తుందని అంచనావేస్తున్నారు.
అలాగే, ఇటీవలే భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ప్లాన్ ప్రతిరోజూ 3 జిబి డేటా మరియు బిఎస్‌ఎన్‌ఎల్ టివి సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. ఈ రూ. 1,999 రూపాయల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటును అందిస్తుంది, ప్రస్తుతం 71 రోజుల అదనపు వ్యవధి అందుబాటులో ఉందికాబట్టి మొత్తంగా 436 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. రిపబ్లిక్ డే 2020 న కంపెనీ ఈ అదనపు వ్యాలిడిటీని ప్రకటించింది.