BSNL రూ. 200 ధరలో ఆఫర్ చేస్తున్న లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్.!

BSNL రూ. 200 ధరలో ఆఫర్ చేస్తున్న లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్.!
HIGHLIGHTS

రూ. 200 ధరలో BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

కాలింగ్, డేటా, మరియు మరిన్ని ప్రయోజనాలు

అతి తక్కువ రేటుకే ఎక్కువ లాభాలు అందిస్తాయి ఈ BSNL ప్లాన్స్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) యూజర్లకు చాలా తక్కువ ధరలో కూడా గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని టెలికం కంపెనీలు కూడా వాటి రీఛార్జ్ ప్లాన్స్ రేట్ లలో చాలా మార్పులు చేసినా, BSNL మాత్రం ఇప్పటికీ చాలా తక్కువ రేట్లకే గొప్ప రీఛార్జ్ ప్లాన్ అలను ఆఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీగా నిలుస్తుంది. అటువంటి బిఎస్ఎన్ఎల్ కేవలం రూ.200 ధరలో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఈరోజు తెలుసుకుందామా.

BSNL రూ. 200 ధరలో ఆఫర్ చేస్తున్న ప్లాన్స్

కేవలం రూ. 200 ధరలో బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ప్లాన్ లలో రూ. 107, రూ. 153, మరియు రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అందించే అన్ని ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

బిఎస్ఎన్ఎల్ రూ. 107 ప్లాన్

ఈ ప్లాన్ 35 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఈ కాలానికి గాను 3GB ఉచిత డేటా, అన్ని నెట్వర్క్ లకు 200 Min ఉచిత కాలింగ్ మరియు 35 రోజులకు free BSNL Tune లను కూడా అందిస్తుంది. తక్కువ డేటా మరియు లిమిటెడ్ కాలింగ్ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరిపోతుంది.

Also Read : Sale Offer: లేటెస్ట్ స్టైలిష్ 5G Phone పైన Amazon GIF Sale బెస్ట్ ఆఫర్.!

బిఎస్ఎన్ఎల్ రూ. 153 ప్లాన్

ఈ రూ. 153 ప్లాన్ 26 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1GB డేటా, 100 SMS / డైలీ మరియు Free PRBT వంటి ప్రయోజనాలను అందిస్తుంది. తక్కువ ధరలో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా కోరుకునే వారికీ ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.

బిఎస్ఎన్ఎల్ రూ. 199 ప్లాన్

bsnl best prepaid plan under rs 200
బిఎస్ఎన్ఎల్ రూ. 199 ప్లాన్

ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 199 ప్లాన్ 200 ధరలో లభించే టాప్ ప్లాన్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB హైస్పీడ్ డేటా మరియు 100 SMS / డైలీ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. నెల మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ అధిక డేటా కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరిపోతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo