BSNL ధమాకా: రూ.800 కంటే తక్కువకే సంవత్సరం వ్యాలిడిటీ అందుకోండి.!

BSNL ధమాకా: రూ.800 కంటే తక్కువకే సంవత్సరం వ్యాలిడిటీ అందుకోండి.!
HIGHLIGHTS

రూ.800 కంటే తక్కువకే సంవత్సరం వ్యాలిడిటీ అందుకోండి

పూర్తిగా సంవత్సరం మొత్తం ప్రయోజానాలను అందించే బెస్ట్ ప్లాన్

BSNL యొక్క బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్

BSNL ధమాకా: రూ.800 కంటే తక్కువకే సంవత్సరం వ్యాలిడిటీ అందుకోండి. అత్యంత తక్కువ ధరలో పూర్తిగా సంవత్సరం మొత్తం ప్రయోజానాలను అందించే బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే గొప్ప అఫర్ BSNL నుండి అందుబాటులో వుంది. టెలికం కంపెనీలు అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లలో BSNL యొక్క లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. మరి BSNL యొక్క ఈ బెస్ట్ ప్లాన్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలను గురించి తెలుసుకుందామా. 

BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూస్తే, ఈ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో మీకు పూర్తిగా ఒక సంవత్సరం మొత్తం నిశ్చింతగా వ్యాలిడిటీని పొందుతారు. అంతేకాదు,అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా  ఈ ప్లాన్ తో పొందుతారు. ఈ అన్లిమిటెడ్ కాలింగ్ ను మీరు అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తో మీకు అందిస్తోంది. 

ఇక డేటా విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో మీకు రోజూ 2GB హై స్పీడ్ డేటా అందించబడుతుంది. ఈ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు వరకూ మాత్రమే వర్తిస్తాయి. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఉచిత SMS మరియు 2GB హై స్పీడ్ డేటా లాభాలు మీకు కేవలం 60 రోజులు మాత్రమే అందుతాయి. కానీ, వ్యాలిడిటీ మాత్రం పూర్తిగా 365 రోజులకు వర్తిస్తుంది. 

Freebies కాల పరిమితి ముగిసిన తరువాత లోకల్ కాల్ కోసం రూ.1/min మరియు STD కాల్ కోసం రూ.1.3/min ఛార్జ్ చేయబడుతుంది. అలాగే, లోకల్ SMS కోసం రూ.80p/SMS, నేషనల్ మెసేజ్ కోసం రూ.1.20p/SMS మరియు ఇంటర్నేషనల్ మెసేజ్ కోసం రూ.5/SMS చెల్లించవలసి వస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే, ప్రతీ 1MB డేటా వినియోగం పైన 25 పైసలు ఛార్జ్ చేయబడుతుంది.

BSNL బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo