ప్రైవేట్ టెలికం కంపెనీలకు గట్టి పోటీని అందించే దిశగా అధిక ప్రయోజనాలను అందించే దిశగా ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లోని బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు 1000 పైగా టీవీ ఛానల్స్ ను వీక్షించే అద్భుతమైన సదుపాయాన్ని అందుకోనున్నారు. BSNL అతిత్వరలో అందించనున్న ఈ సదుపాయం పైన ఒక లుక్కేద్దాం పదండి.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరియు సిటీ ఆన్లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తో జతగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సర్వీస్ లను తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ల ద్వారా ఒకే కనెక్షన్ పైన బ్రాండ్ బ్యాండ్ మరియు టీవీ ఛానల్స్ ను పొందవచ్చు. ముందుగా, BSNL ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సర్వీస్ లను విజయవాడలో ప్రారంభించింది. ఈ సర్వీస్ ను ఉల్కా టీవీ (ulka TV) పేరుతో అందించింది మరియు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లోని బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు పొందనున్నారు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సర్వీస్ లను కొత్త కస్టమర్లు మరియు ఇటప్పటికే కొనసాగుతున్న కస్టమర్లు కూడా పొందవచ్చు. అంతేకాదు, ఈ సర్వీసులు కేవలం టీవీలలో మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్లలో కూడా BSNL వినియోగధారులు పొందవచ్చు. BSNL బ్రాండ్ బ్యాండ్ ప్లాన్స్ పైన అందిస్తున్న ఈ కొత్త సదవకాశం వినియోగదారులకు ఒకే కనెక్షన్ పైన రెండు లాభాలను అందిస్తుందని, BSNL తెలిపింది.