భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన 5 ప్రీపెయిడ్ ప్రణాళికల పైన రోజువారీ 2.2 GB అధిక డేటాని ప్రకటించింది. BSNL యొక్క ప్రీపెయిడ్ ప్రణాళికలైనటువంటి, Rs 186, Rs 429,Rs 485,Rs 666, మరియు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ అయినటువంటి Rs 1699 పైన కూడా ఈ 2.2 GB రోజువారీ అధిక డేటాని అందించింది. అయితే, ముందుగా, జూలై 30 వ తేదీతో ఈ ప్రణాళికల పైన అధిక ఉచిత డేటా అఫర్ ముగుస్తుందని ప్రకటించినా, వీటిపైన వినియోగదారుల స్పందన అనుసరించి, ఈ ప్రణాళికలను అక్టోబరు 1వ తేది 2019 వరకు అందుబాటులో ఉంచింది.
ఇకవైపు, BSNL వినియోగదారులకి 4G అందిచడం కోసం ప్రణాళికలను చేస్తూనే, ప్రస్తుతం ఉన్నా కొన్ని ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రోత్సహించే ఉదేశ్యంతో గొప్ప లాభాలను అందిస్తోంది.
ఈ నివేదికను ముందుగా టెలికాం టాక్ అందించింది . ఈ నివేదిక ప్రకారం BSNL మరొకసారి 6 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన అదే 2.2 అదనపు డేటా ఆఫరును కొనసాగించనున్నదని తెలుస్తోంది. ఈ క్రింది తెలిపిన 6 ప్రీపెయిడ్ ప్లాన్లకు ఈ అఫర్ యొక్క ఆఖరి గడువు తేదీని 1.10.2019 వరకూ పొడిగించనుంది.
1. Rs 186 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.2GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 28 రోజుల వ్యాలిడిటీ.
2. Rs 429 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.2GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 81 రోజుల వ్యాలిడిటీ.
3. Rs 485 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.7GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 28 రోజుల వ్యాలిడిటీ. అయితే, ముందుగా రోజువారీ 1.5GB దాటని అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను కూడా ఈ అదనపు డేటా ప్రయోజన జాబితాలోకి తీసుకొచ్చింది BSNL.
4. Rs 666 ప్లాన్ ప్రయోజనాలు – అపరిమిత కాలింగ్, రోజువారీ 3.7GB మరియు అన్లిమిటెడ్ SMS(100/రోజుకి) 129 రోజుల వ్యాలిడిటీ.
5. Rs 1699 ప్రీపెయిడ్ ప్లాన్
BSNL యొక్క వార్షిక Rs.1699 ప్లాన్ తో, లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, రోజువారీ 100SMS లు మరియు రోజువారీ 2GB డాటాతో మొత్తంగా 730GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క FUP పరిమితిని దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ప్రస్తుత ప్రకటనతో దీని యొక్క రోజువారి డేటా 2GB నుండి 4.2GB కి చేరుకుంది. అంటే, ఈ ప్లాను ద్వారా ఇపుడు రోజువారీ 4.2 GB డేటాని వాడుకోవచ్చు.