30,000 Wi-Fi స్పాట్లను మోహరించిన BSNL : కేవలం రూ.19 ధరలో 2GB డేటాని కూడా అఫర్ చేస్తోంది
బిఎస్ఎన్ఎల్, ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక వై-ఫై హాట్ స్పాట్లను కలిగివున్న టెలికం సంస్థగా అవతరించింది.
బిఎస్ఎన్ఎల్, ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక వై-ఫై హాట్ స్పాట్లను కలిగివున్న టెలికం సంస్థగా అవతరించింది. BSNL దేశంలో దాదాపుగా 30,419 Wi-Fi హాట్ స్పాట్లను మోహరించింది మరియు అతితక్కువ ధరకే ఎక్కువ డేటాని అఫర్ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంకా BSNL, వీటితో పాటుగా తన కొత్త టారిఫ్ ఓచర్లను కూడా అతితక్కువ ధరతో ముందుగా ప్రకటించింది.
BSNL యూజర్లు ఈ Wi-Fi ని ఉపయోగించడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది . ఇటీవలే బిఎస్ఎన్ఎల్ దీనికి సంబంధించి నాలుగు ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లు రూ. 100 ధరలోపలలే లభిస్తాయి. ముందుగా దీని గురించి టెలికామ్ టాక్ ద్వారా తెలియవచ్చింది. అలాగే, ఈ టెలికామ్ టాక్ యొక్క నివేదిక ప్రకారంగా, BSNL కొన్ని సరికొత్త Wi-Fi టారిఫ్ ఓచర్లను కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.
BSNL టారిఫ్ యొక్క మొదటి ప్రణాళిక, ఇది కేవలం రెండు రోజుల చల్లుబాటుతో వస్తుంది మరియు 2GB డేటా ప్రామాణికతతో వస్తుంది. దీనిని రూ.19 ధరతో ప్రకటించింది. ఇక రెండవ ప్లాన్ విషయానికి వస్తే, రెండవ ప్రణాళిక 7GB డేటాతో ఒక వారం అంటే 7 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు దీన్ని రూ 39 ధరతో పొందవచ్చు.
ఇక మిగిలిన రెండు ప్లాన్ల విషయానికి వస్తే, 15GB డేటా మరియు 15 రోజులు చెల్లుబాటు అయ్యే ప్లాన్, రూ .59 ధరతో అందించింది. చివరి ప్లాన్ గురించి చర్చించినట్లయితే, ఇది రూ. 69 ధరతో ఇది వస్తుంది మరియు అధికమైన డేటాని కోరుకునే వారికోసం ఈ ప్లాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ప్లానుతో 30GB డేటాని , పూర్తి 28 రోజులు చెల్లుబాటుతో అందుకోవచ్చు.