రూ.797 ప్లాన్ తో 365 డేస్ వ్యాలిడిటీ, కాలింగ్, డైలీ 2GB డేటా పొందండి.!

Updated on 12-Jan-2023
HIGHLIGHTS

అతితక్కువ ధరలో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్

ఈ ప్లాన్ తో మీకు రోజూ 2GB హై స్పీడ్ డేటా అందించబడుతుంది

రూ.797 ధరలోనే ఎక్కువ ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్

అతితక్కువ ధరలో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందిస్తున్న రూ.797 ప్లాన్ బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు.ఈ ప్లాన్ కేవలం బడ్జెట్ ధరలోనే ఎక్కువ ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఈ ఇంత తక్కువ ధరలో ఇంత ఎక్కువ వ్యాలిడిటీని అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)మాత్రమే  నిలుస్తుంది. 

ఈ BSNL రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రయివేట్ టెలికం కంపెనీలైన జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా లకు భారీ పోటీనిచ్చే ఈ ప్లాన్ ను బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా కూడా చెప్పవచ్చు. మరి BSNL యొక్క రూ. 797 రూపాయల బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాల గురించి తెలుసుకుందామా. 

BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూస్తే, ఈ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో మీకు పూర్తిగా ఒక సంవత్సరం మొత్తం నిశ్చింతగా వ్యాలిడిటీని పొందుతారు. అంతేకాదు,అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా  ఈ ప్లాన్ తో పొందుతారు. ఈ అన్లిమిటెడ్ కాలింగ్ ను మీరు అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తో మీకు అందిస్తోంది. 

ఇక డేటా విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో మీకు రోజూ 2GB హై స్పీడ్ డేటా అందించబడుతుంది. ఈ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు వరకూ మాత్రమే వర్తిస్తాయి. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఉచిత SMS మరియు 2GB హై స్పీడ్ డేటా లాభాలు మీకు కేవలం 60 రోజులు మాత్రమే అందుతాయి. కానీ, వ్యాలిడిటీ మాత్రం పూర్తిగా 365 రోజులకు వర్తిస్తుంది. 

Freebies కాల పరిమితి ముగిసిన తరువాత లోకల్ కాల్ కోసం రూ.1/min మరియు STD కాల్ కోసం రూ.1.3/min ఛార్జ్ చేయబడుతుంది. అలాగే, లోకల్ SMS కోసం రూ.80p/SMS, నేషనల్ మెసేజ్ కోసం రూ.1.20p/SMS మరియు ఇంటర్నేషనల్ మెసేజ్ కోసం రూ.5/SMS చెల్లించవలసి వస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే, ప్రతీ 1MB డేటా వినియోగం పైన 25 పైసలు ఛార్జ్ చేయబడుతుంది.

BSNL బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :