దేశంలో అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్: రూ.20 లోపలే 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.!

Updated on 08-Mar-2023
HIGHLIGHTS

దేశంలో అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

ఈ ప్లాన్ రూ.19 ధరతో ఏకంగా 90 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది

ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది

దేశంలో అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు తెలుసుకోండి. దేశంలో అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ రూ.19 ధరతో వస్తుంది మరియు ఈ ప్లాన్ ఏకంగా 90 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది. ఇంత చవక రేటుకే లాంగ్ వ్యాలిడిటీ తన కస్టమర్లకు అందిస్తున్న ఏకైక టెలికం కంపెనీగా ప్రభుత్వ టెలికం కంపెనీ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) మాత్రమే నిలుస్తుంది. BSNL అందిస్తున్న ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ దేశం అంతటా అందుబాటులో లేకపోవడమే నిరాశ కలిగించే విషయం. 

మనం మాట్లాడుతున్న ఈ 19 రూపాయల BSNL ప్లాన్ కేవలం ఒక్క సర్కిల్ లో మాత్రమే ఈ ప్లాన్ చెల్లుబాటులో వుంది. దేశంలో అత్యంత చవకైన ఈ ప్లాన్ ఏ సర్కిల్ మరియు రాష్ట్రాలలో చెలామణి అవుతోంది, ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.

BSNL రూ.19 ప్లాన్:

BSNL రూ.19 ప్లాన్ పూర్తిగా 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ తో 20 నిముషాల వాయిస్ కాలింగ్ మినిట్స్ కూడా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అఫర్ చేస్తోంది. అయితే, ఈ వాయిస్ కాలింగ్ మినిట్స్ ను 30 రోజుల వ్యవధిలోనే ఉపయోగించుకోవలసి ఉంటుంది. BSNL ఈ ప్లాన్ ను వ్యాలిడిటీ ఎక్స్ టెన్షన్ వోచర్ గా అందిస్తోంది. ఈ ప్లాన్ తో నిముషానికి కాల్ ఛార్జ్ లెక్కించ బడుతుంది.

ఇక ప్లాన్ చెల్లుబాటు అయ్యే సర్కిల్స్ విషయానికి వస్తే, BSNL యొక్క ఈ రూ.19 ప్లాన్ నార్త్ ఈస్ట్ సర్కిల్ పరిధిలో అందుబాటులో ఉంచింది. అంటే, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం , మేఘాలయా,  నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపుర రాష్ట్రాలలో ఈ అత్యంత చవకైన ప్లాన్ అందుబాటులో వుంది.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :