BSNL: బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు, ఆల్ రౌండ్ లాభాలు సంవత్సరం అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి అందుబాటులో వుంది. ఈ ప్లాన్ చాలా తక్కువ ధరలో డేటా, కాలింగ్ మరియు SMS లాభాలను కూడా తీసుకు వస్తుంది. మీ బడ్జెట్ చాలా తక్కువ అయితే ఈ ప్లాన్ ను పరిశీలించవచ్చు.
BSNL యొక్క రూ. 1,198 రూపాయల ప్లాన్ ఆల్ రౌండ్ లాభాలను అందించే ప్లాన్ లలో మొదటి వరుసలో ఉంటుంది. ఈ ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, పూర్తిగా సంవత్సరం మొత్తంగా మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలు ఏమిటో ఒక లుక్కేయండి.
బిఎస్ఎన్ఎల్ ఈ రూ. 1,198 ప్లాన్ పూర్తిగా సంవత్సరం వ్యాలిడిటీని నెలవారీ ప్రయోజనాలతో తీసుకువస్తుంది. అంటే, ఇది నెల నెల కాలింగ్, డేటా మరియు ఇతర ప్రయోజనాలను యాడ్ చేస్తుంది.
ఈ ప్లాన్ తో నెలకు 300 నిముషాల కాలింగ్ మినిట్స్ చొప్పున 12 నెలలు అందిస్తుంది. ఇదే విదంగా, నెలకు 3GB హై స్పీడ్ డేటాని మరియు నెలకు 30 SMS ల చొప్పున 12 నెలలు, అంటే సంవత్సరం మొత్తం అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,198 ప్లాన్ ను నెలకు విభజిస్తే 100 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే ఆల్ రౌండ్ ప్రయోజనాలను అందుకోవచ్చు.
మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here