BSNL: రూ. 150 కే నెలంతా అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్.!

BSNL: రూ. 150 కే నెలంతా అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్.!
HIGHLIGHTS

దేశంలో పెరిగిన టెలికాం ఛార్జ్ లతో సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి

బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటాయి

రూ. 150 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే నెల మొత్తం అన్లిమిటెడ్ కాల్స్ అందించే ప్లాన్

BSNL: దేశంలో పెరిగిన టెలికాం ఛార్జ్ లతో సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. అయితే, ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. ప్రైవేట్ టెలికాం కంపెనీలు యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను తీసుకువస్తున్నా బిఎస్ఎన్ఎల్ అందించిన ఒక బెస్ట్ ప్లాన్ మాత్రం కేవలం రూ. 150 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే నెల మొత్తం అన్లిమిటెడ్ కాల్స్ ప్రయోజనాలు అందిస్తుంది.

ఏమిటి BSNL యొక్క ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ చాలా కాలంగా ఆఫర్ చేస్తున్న రూ. 147 రూపాయల ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ అతి చవక ప్రీపెయిడ్ నెల మొత్తం ఆల్రౌండ్ ప్రయోజనాలు అందిస్తుంది. మరి బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.

బిఎస్ఎన్ఎల్ రూ. 147 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 147 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఈ 30 వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లకు 10GB హై స్పీడ్ డేట్ కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 30 రోజుల రింగ్ టోన్ (PRBT) ని కూడా సెట్ చేసుకోవచ్చు.

BSNL Rs. 147 Plan

అయితే, ఈ సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ తో SMS లేదా మరే ఇతర సౌకర్యాలు లభించవు. అయితే, 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ కోరుకునే యూజర్లకు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ మీరు అధిక డేట్ కోరుకునే యూజర్ అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మీకు సరిపోదు.

లేటెస్ట్ మరియు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo