BSNL: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్..!!

BSNL: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్..!!
HIGHLIGHTS

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే BSNL బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్

BSNL వినియోగదారులకు అధిక ప్రయోజాలను అందించే బెస్ట్ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ గొప్ప అన్లిమిటెడ్ ప్లాన్స్ కలిగి వుంది

BSNL: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ లను తన వినియోగదారులకు చాలానే అఫర్ చేస్తోంది. ప్రభుత్వ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ గొప్ప అన్లిమిటెడ్ ప్లాన్స్ కలిగి వుంది. అందుకే, వినియోగదారులకు అధిక ప్రయోజాలను అందించే బెస్ట్ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ గురించి తెలుసుకోనున్నాము. అదే, BSNL యొక్క రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ అన్లిమిటెడ్ కస్టమర్లకు 45 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది.

BSNL రూ.249:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఇది కేవలం వ్యాలిడిటీ మాత్రమే తీసుకువస్తుంది అని మాత్రం అనుకోకండి. ఈ ప్లాన్ తో డైలీ 2GB హాయ్ స్పీడ్ డేటా అందుతుంది మరియు ఎటువంటి రోమింగ్ లేకుండా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS లను కూడా మీరు ఈ ప్లాన్ తో పొందవచ్చు. డైలీ డేటా ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది.

ఇక BSNL ఎక్కువ ప్రయోజాలను అఫర్ చేస్తున్న మరొక రెండు ప్లాన్ లు కూడా వున్నాయి. అవే, BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్.  ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజాల గురించి క్రింద చూడవచ్చు.

BSNL రూ.797:

BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే, ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు.

BSNL రూ.397:

పైన తెలిపి అఫర్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా BSNL తన కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.  ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి 300 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ అఫర్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo