BSNL: చవక ధరలో లాంగ్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్.!

BSNL: చవక ధరలో లాంగ్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్.!

BSNL: తక్కువ రేటుకే లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తున్న టాప్ టెలికాం కంపెనీ గా బిఎస్ఎన్ఎల్ నిలుస్తుంది. నెలకు రూ. 200 కంటే తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లతో అందుకోవచ్చు. మంచి వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూసే వారికి సహాయంగా బిఎస్ఎన్ఎల్ అందించిన ఆ బెస్ట్ బడ్జెట్ లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

BSNL బెస్ట్ బడ్జెట్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఈ కేటగిరిలో నిలుస్తాయి. అవేమిటంటే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ లు నిలుస్తాయి. ఇందులో మొదటి ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 160 రోజులు చెల్లుబాటు తో వస్తే, రెండవ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది.

బిఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజులు డైలీ 2GB హై స్పీడ్ డేట్ మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో అందించే డేటా ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటా సౌకర్యం అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగం కూడా అందిస్తుంది. అక్టోబర్ 24వ తేదీ లోపుగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు 24 రోజుల చెల్లుబాటు కలిగిన 24GB ల అదనపు డేటా కూడా లభిస్తుంది.

BSNL Best Deals

బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 1,198 ప్లాన్ సంవత్సరం మొత్తం, అంటే 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అందివచ్చే లాభాలు మాత్రమే నెల వారీగా అందుతాయి. ఈ ప్లాన్ తో నెలకు 300 మినిట్స్ కాలింగ్, 3GB డేటా మరియు 30 SMS చొప్పున 12 నెలలు అందిస్తుంది. అక్టోబర్ 24వ తేదీ లోపుగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు 24 రోజుల చెల్లుబాటు కలిగిన 24GB ల అదనపు డేటా కూడా ఈ ప్లాన్ తో లభిస్తుంది.

Also Read: Amazon Echo Show 5 అమెజాన్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తోంది.!

మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo