BSNL: రూ.200 లోపలే డైలీ 2GB హై స్పీడ్ డేటా అందించే బెస్ట్ ప్లాన్స్..!!

Updated on 25-Aug-2022
HIGHLIGHTS

రోజుకు 2GB హై స్పీడ్ డేటా అఫర్ చేసే BSNL బెస్ట్ ప్లాన్స్

బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఈ ప్లాన్స్ సరిగ్గా సరిపోతాయి

కేవలం 200 కంటే తక్కువ ధరలో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

BSNL కేవలం 200 రూపాయల కంటే తక్కువ ధరకే రోజుకు 2GB హై స్పీడ్ డేటా అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ ను కూడా కస్టమర్ల కోసం అందించింది. అంతేకాదు, ఈ ప్లాన్స్  అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS ప్రయోజాలతో పాటుగా వస్తాయి. కేవలం 200 కంటే తక్కువ ధరలో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం చూస్తున్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఈ ప్లాన్స్ సరిగ్గా సరిపోతాయి. మరి BSNL తగిన రేటుకే గొప్ప ప్రయోజాలను అందించే ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా. 

BSNL రూ.197 ప్లాన్

BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు  డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఈ ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీడీటీ మాత్రం 150 రోజులకు వర్తిస్తుంది. అంటే, BSNL కస్టమర్లు కేవలం 200 రూపాయల కంటే తక్కవ ఖర్చుతోనే 5 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు.

BSNL రూ. 199 రీఛార్జ్ ప్లాన్

BSNL యొక్క రూ. 199 రీఛార్జ్ చేసే వారికి  పూర్తి నెల రోజుల (30) రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు , ఈ వ్యాలిడిటీ కాలానికి గాను ప్రతీరోజు 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా లభిస్తుంది. అధనంగా, డైలీ 100 ఉచిత SMS లను కూడా ఈ ప్లాన్ అఫర్ చేస్తుంది.  డైలీ డేటా లిమీట్ ముగిసిన తరువాత స్పీడ్ 80 kbps కి తగ్గించబడుతుంది.   

మరిన్ని BSNL ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :