BSNL : 160 రోజులు డైలీ 2 GB డేటా మరియు అన్లిమిటెడ్ అందించే టాప్ ప్లాన్.!

BSNL : 160 రోజులు డైలీ 2 GB డేటా మరియు అన్లిమిటెడ్ అందించే టాప్ ప్లాన్.!
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది

160 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు మరిన్ని ప్రయోజనాలు ఈ ప్లాన్ అందిస్తుంది

BSNL : బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. వీటిలో 160 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి వుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు మరిన్ని ప్రయోజనాలు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తుంది. నామమాత్రపు ఖర్చుతో అన్ని ప్రయోజనాలు కాలిన బెస్ట్ ప్లాన్ కోసం చూసే వారికి తగిన విధంగా ఉండేలా ఈ ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ అందించింది.

BSNL 160 డేస్ ప్రీపెయిడ్ ప్లాన్

BSNL 160 డేస్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డేట్ మరియు మరిన్ని లాభాలు అందుకునే అవకాశం వుంది. అదే బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 997 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 16 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది, ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

BSNL రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు రోజుకు 2GB చొప్పున 160 రోజులకు గాను 320GB డేటా అందిస్తుంది. ఈ రోజు వారి డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేట్ అందిస్తుంది.

BSNL

ఈ ప్లాన్ తో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను పూర్తిగా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో WOW ఎంటర్టైన్మెంట్, BSNL ట్యూన్స్, జింగ్ మ్యూజిక్ మరియు చాలా గేమ్స్ కి యాక్సెస్ అందిస్తుంది.

Also Read: జపనీస్ ఆడియో సొసైటీ అప్రూవ్ Opera ANC తో కొత్త సూపర్ పోడ్స్ లాంచ్ చేస్తున్న MIVI

ఈ ప్లాన్ 5 నెలల కంటే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది.

లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo