BSNL ధమాకా ఆఫర్: రూ. 797 రూపాయలకే 300 రోజులు లాభాలు| New offer
BSNL యూజర్ల కోసం ధమాకా ఆఫర్ ను అందించింది
బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తున్న ఈ రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్
అతి తక్కువ ఖర్చుతో 300 రోజుల ప్రయోజనం
BSNL యూజర్ల కోసం ధమాకా ఆఫర్ ను అందించింది. అతి తక్కువ ఖర్చుతో 300 రోజుల ప్రయోజనాన్ని రూ. 797 రూపాయల ప్లాన్ తో అఫర్ చేస్తోంది. ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ Prepaid Plan తో పాటుగా యూజర్లకు మంచి ప్రయోజనాలను అందించే మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇంకా ఉన్నాయి. ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ అఫర్ చేస్తున్న ఈ రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటుగా మరో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి కూడా వివరంగా చూద్దాం.
BSNL Rs.797 Plan Benefits
బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అఫర్ చేస్తున్న ఈ Rs.797 బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2 GB హైస్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 100SMS వాడుక లాభాన్ని కూడా అఫర్ చేస్తుంది.
అయితే, పైన తెలిపిన అధనపు ప్రయోజనాలైన అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు SMS ప్రయోజనాలు కేవలం 60 రోజులు మాత్రమే అందుతాయి. కానీ, వ్యాలిడిటీ మాత్రం పూర్తిగా 300 రోజులు ఉంటుంది. ఈ ఉచిత అధనపు ప్రయోజనాలు ముగిసిన తరువాత లోకల్ లేదా STD కాల్ కోసం Rs 2/min, SMS కోసం 80p/SMS, డేటా కోసం 25p/MB ఛార్జ్ చేస్తుంది.
ఇక పూర్తిగా సంవత్సరం మొత్తం కాలింగ్, డేటా మరియు SMS లాభాలను నెలకు కేవలం రూ. 100 రూపాయల అతి తక్కువ ఖర్చుకే అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి వుంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,198 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అందించే అన్ని లాభాలను క్రింద చూడవచ్చు.
Also Read: Gold Rate: కుప్పకూలిన బంగారం ధరలు.. 6 నెలల కనిష్ఠానికి చేరిన గోల్డ్ రేట్|Latest News
Rs.1,198 Plan Benefits
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,198 రూపాయల బడ్జెట్ వన్ ఇయర్ ప్లాన్ కాలింగ్, డేటా మరియు SMS వంటి ఆల్రౌండ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో అందించే ఇతర ప్రయోజనాలు 12 నెలలకు విభజించి అందిస్తుంది. ఈ ప్లాన్ తో ప్రతి నెలా 300min కాలింగ్, 3GB హై స్పీడ్ డేటా మరియు 30SMS ప్రయోజనాలు అందించబడతాయి.
ఈ విధంగా ప్రతి నెలా ఈ ప్రయోజనాలు 12 నెలకు అందించబడతాయి. ఈ ఉచిత ప్రయోజనాల లిమిట్ ముగిసిన తరువాత మీరు నార్మల్ ఛార్జ్ లు వర్తిస్తాయి. ఇందులో, లోకల్ కాల్ కోసం Rs 1/min, STD కాల్ కోసం Rs 1.3/min, SMS కోసం 80p/SMS, డేటా కోసం 25p/MB ఛార్జ్ చేస్తుంది.