BSNL : రూ. 400 కంటే తక్కువ ధరలో 150 రోజులు వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్.!
చవక ధరలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్న ఏకైక టెలికాం BSNL
చాలా చవక ధరలో 150 రోజులు వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్
చవక ధరలో ఎక్కువ వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్
BSNL చాలా చవక ధరలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ గా నిలుస్తుంది. ప్రభుత్వ టెలికాం అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ లలో చాలా చవక ధరలో 150 రోజులు వ్యాలిడిటీ మరియు మరిన్ని ఇతర బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి వుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందామా.
ఏమిటా BSNL బెస్ట్ ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ చాలా కాలంగా ఆఫర్ చేస్తున్న రూ. 397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
బిఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ 150 రోజులకు గాను ఇన్కమింగ్ కాల్స్ మరియు వ్యాలిడిటీ లాభాన్ని అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మరిన్ని లాభాలను కూడా బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తుంది.
ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ఇతర లాభాల విషయానికొస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 30 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాలని అందుకుంటారు.
Also Read: బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు Xiaomi బిగ్ OLED TV పై బిగ్ డీల్ అందుకోండి.!
అంతేకాదు, ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని 40 రోజుల పాటు అందుకుంటారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ఈ 30 రోజుల ఫ్రీ బైస్ ముగిసిన తర్వాత రెగ్యులర్ ఛార్జ్ రేటుకు వర్తిస్తాయి. అంటే, లోకల్ కాల్ కోసం నిమిషానికి రూ. 1, STD కాల్ కోసం రూ. 1.30 పైసలు ఛార్జ్ చేస్తుంది. అలాగే, లోకల్ SMS కోసం 80p మరియు STD SMS కోసం 1.20 పైసలు ఛార్జ్ చేస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే, 1MB డేటా కోసం 25 పైసలు వసూలు చేస్తుంది.
మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here