తక్కువ ఖర్చులో 65 రోజులు డేటా, కాలింగ్ అందించే BSNL బెస్ట్ ప్లాన్.!

Updated on 31-Mar-2023
HIGHLIGHTS

65 రోజులు డేటా, కాలింగ్ అందించే BSNL బెస్ట్ ప్లాన్

తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్

రోమింగ్ లో కూడా ఎటువంటి చింతా లేకుండా కాలింగ్ చేసుకోవచ్చు

తక్కువ ఖర్చులో 65 రోజులు డేటా, కాలింగ్ అందించే BSNL బెస్ట్ ప్లాన్ గురించి ఈరోజు చూడనున్నాము. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే అందించింది. అందులో, తక్కువ ఖర్చుతోనే 65 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే BSNL రూ.319 బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఒకటి వుంది ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా. 

BSNLRs.319 Plan:

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్ లలో ఒకటిగా చెబుతారు. ఈ ప్లాన్ రీచార్జ్ తో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అంటే, పూర్తిగా 65 రోజులు హోమ్ నెట్ వర్క్ మరియు ముంబై, ఢిల్లీ (MTNL) లలో కూడా రోమింగ్ లో కూడా ఎటువంటి చింతా లేకుండా కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, ఈ ప్లాన్ తో 300 SMS మరియు 10GB ప్రయోజనాలు కూడా మీకు అందుతాయి. 

ఇక ఇటివంటి మరొక బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూసినట్లయితే, మీరు రూ.1,198 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

BSNL Rs.1,198 Plan:

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యొక్క ఈ రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి నప్పుతుంది. ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 3GB డేటా మరియు 30 SMS లను అందిస్తుంది. ఈవిధంగా ప్రతీ నెలా మీకు కాలింగ్, డేటా మరియు SMS లాభాలు అందుతాయి. అంటే, 12 నెలలు (365 days) మీరు కాలింగ్, డేటా మరియు SMS లాభాలను ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

రూ.1,198 ప్లాన్ ను 12 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ.99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. అయితే, కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు. కానీ, తక్కువ ధరలో రెగ్యులర్ వాడకానికి ఈ ప్లాన్ సరిపోతుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :