BSNL Best Plans: తెలుగు రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ ఇవే.!

Updated on 27-Sep-2024
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ తెలుగు రాష్ట్రాల్లోని యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది

కేవలం రూ. 200 ఖర్చుతో నెలంతా అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్లాన్స్

బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఈరోజు చూద్దాం

BSNL Best Plans: బిఎస్ఎన్ఎల్ తెలుగు రాష్ట్రాల్లోని యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది. కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ అయితే కేవలం రూ. 200 ఖర్చుతో నెలంతా అన్లిమిటెడ్ లాభాలను అందిస్తాయి. జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆఫర్ చేస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ లతో పోలిస్తే, ఈ ప్లాన్స్ చాలా చవకైన ప్లాన్స్ గా నిలుస్తాయి. అందుకే, తెలుగు రాష్ట్రాల్లోని యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఈరోజు చూద్దాం.

మొదటి నుంచి నెట్ వర్క్ పరంగా కొంత నెగిటివ్ ఇంప్రెషన్ ను సంపాదించుకున్న బిఎస్ఎన్ఎల్, ఇప్పుడు ఆ చిన్న గ్యాప్ ను కూడా పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా 4G నెట్ వర్క్ ను వేగంగా విస్తరిస్తోంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2025 మధ్య కాలం నాటికి దేశవ్యాప్తంగా 4G సేవలు విరివిగా అందుబాటులోకి వస్తాయి. నెట్ వర్క్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత విశిష్టతను సంతరించుకుంటుంది. అయితే, ఇప్పటికే 4G నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో మంచి స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నట్లు కస్టమర్లు చెబుతున్నారు. అందుకే, ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ వన్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్లు చూడనున్నాము.

BSNL Best Plans:

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు 229 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ బెస్ట్ బడ్జెట్ వన్ మంత్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

Also Read: Amazon Sale నుంచి చవక ధరలో లభిస్తున్న Dolby Soundbar డీల్స్ పై లుక్కేయండి.!

బిఎస్ఎన్ఎల్ రూ. 199 & రూ. 229 ప్లాన్స్

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా డైలీ 2GB హై స్పీడ్ డేటా ఆఫర్ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS ప్రయోజనాలు అందిస్తాయి. అయితే రెండు ప్రధాన తేడాలు ఈ ప్లాన్స్ మధ్య ఉన్నాయి.

అవేమిటంటే, రూ. 199 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తే, రూ. 229 ప్రీపెయిడ్ ప్లాన్ క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ అందిస్తుంది. రెండవది ఏమిటంటే, రూ. 199 ప్లాన్ Hardy గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్ ఆన్ Astrotell, Gameium, Lystn Podocast మరియు Zing Music లకు నెల రోజుల ఉచిత యాక్సెస్ అందిస్తుంది.

ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ చేయడానికి Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :