BSNL Best Plan: ఈ బడ్జెట్ ప్లాన్ తో నెలంతా అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
బిఎస్ఎన్ఎల్ బెస్ట్ క్యాలెండర్ మంత్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్
పూర్తి నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది
BSNL Best Plan: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు బెస్ట్ క్యాలెండర్ మంత్ ప్లాన్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నెల మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా మరియు మరిన్ని ఇతర లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలు అందించే ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో తెలుసుకుందామా.
ఏమిటా BSNL Best Plan?
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 229 రూపాయల 1 మంత్ క్యాలెండర్ డేస్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నెల రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు పూర్తి నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
బిఎస్ఎన్ఎల్ రూ. 229 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 229 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి నెల రోజులు (క్యాలెండర్ డేస్) వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నెల రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో నెల రోజుల పాటు డైలీ 2GB హాయ్ స్పీడ్ డేటా మరియు డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో నెల రోజుల పాటు డైలీ 100 SMS వినియోగ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇది మాత్రమే ఈ ప్లాన్ తో మరిన్ని లాభాలు కూడా అందిస్తుంది. అవేమిటంటే, ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 229 ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు M/s Onmobile Global Ltd అందించే ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ ప్రోగ్రెసివ్ Web App(PWA) కు ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ కంప్లీట్ లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ నెల రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతుంది.
మరిన్ని బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here