రూ.19 ధరకే 90 రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్ ఒకటి ఉందని మీకు తెలుసా?

Updated on 28-Jan-2023
HIGHLIGHTS

రూ.19 ధరకే 90 రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్

ఈ ప్లాన్ ను అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీ

ఒక్క సర్కిల్ లో మాత్రమే ఈ ప్లాన్ చెల్లుబాటులో వుంది

రూ.19 ధరకే 90 రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్ ఒకటి ఉందని మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు తెలుసుకోండి. ప్రభుత్వ టెలికం కంపెనీ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ ఈ ప్లాన్ ను అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీగా నిలుస్తుంది. ఈ ప్లాన్ ను కేవలం రూ.19 రూపాయలకే 90 రోజుల వ్యాలిడిటీతో అందించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే, ఈ ప్లాన్ దేశం అంతటా  అందుబాటులో లేదు. కేవలం ఒక్క సర్కిల్ లో మాత్రమే ఈ ప్లాన్ చెల్లుబాటులో వుంది. దేశంలో అత్యంత చవకైన ఈ ప్లాన్ ఎక్కడ చెలామణి అవుతోంది, ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.

BSNL రూ.19 ప్లాన్:

BSNL రూ.19 ప్లాన్ పూర్తిగా 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ తో 20 నిముషాల వాయిస్ కాలింగ్ మినిట్స్ కూడా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అఫర్ చేస్తోంది. అయితే, ఈ వాయిస్ కాలింగ్ మినిట్స్ ను 30 రోజుల వ్యవధిలోనే ఉపయోగించుకోవలసి ఉంటుంది. BSNL ఈ ప్లాన్ ను వ్యాలిడిటీ ఎక్స్ టెన్షన్ వోచర్ గా అందిస్తోంది. ఈ ప్లాన్ తో నిముషానికి కాల్ ఛార్జ్ లెక్కించ బడుతుంది.

ఇక ప్లాన్ చెల్లుబాటు అయ్యే సర్కిల్స్ విషయానికి వస్తే, BSNL యొక్క ఈ రూ.19 ప్లాన్ నార్త్ ఈస్ట్ సర్కిల్ పరిధిలో అందుబాటులో ఉంచింది. అంటే, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం , మేఘాలయా,  నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపుర రాష్ట్రాలలో ఈ అత్యంత చవకైన ప్లాన్ అందుబాటులో వుంది.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :