BSNL Best Plan 2025: నెలకు రూ. 100 ఖర్చుతో అన్ని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!
BSNL Best Plan 2025 నెలకి 100 రూపాయల ఖర్చులోనే అని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్
యూజర్లకు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే ఈ బెస్ట్ ప్లాన్
చవక ధరలో కాలింగ్, డేటా మరియు SMS తో సహా అన్ని ప్రయోజనాలు అందిస్తుంది
BSNL Best Plan 2025: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు 2025 కొత్త సంవత్సరంలో యూజర్లకు నెలకి 100 రూపాయల ఖర్చులోనే అని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ పేపర్ ప్లాన్ దేవత భారతదేశంలోనే అత్యంత చవకైన ఆల్ రౌండర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. యూజర్లకు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే ఈ బెస్ట్ ప్లాన్ ఏమిటో తెలుసుకుందామా.
BSNL Best Plan 2025:
బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ బడ్జెట్ ప్లాన్ గా చాలా కాలంగా విలసిల్లుతున్న రూ. 1,198 రూపాయల దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చాలా చవక ధరలో కాలింగ్, డేటా మరియు SMS తో సహా అన్ని ప్రయోజనాలు అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న రూ. 1,198 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రెగ్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మాదిరిగా కాకుండా నెల వారీగా 12 నెలలు మొత్తం ప్రయోజనాలు అందిస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు నెలకు 300 మినిట్స్ కాలింగ్, నెలకు 3GB డేటా మరియు నెలకు 30 SMS ల చొప్పున 12 నెల పాటు అందిస్తుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు కేవలం నెలకు రూ. 100 రూపాయల ఖర్చుతో అన్ని లాభాలు అందుకోవచ్చు.
సాధరణ కాలింగ్ మరియు డేటా సరిపోయే యూజర్స్ కు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నప్పుతుంది. అయితే, అధిక డేటా మరియు కాలింగ్ కోరుకునే వారికి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తగిన ఆప్షన్ కాకపోవచ్చు. ఈ ప్లాన్ అందించే లిమిటెడ్ ప్రయోజనాలు ముగిసిన తర్వాత లోకల్ కాల్ కి నిమిషానికి రూ. 1, STD కాల్ కోసం నిమిషానికి రూ. 1.3 పైసలు, 1 డేటా కోసం 25 పైసలు ఖర్చు అవుతుంది.
Also Read: Pig butchering Scam: దేశంలో అతిగా విస్తరిస్తున్న ఈ స్కామ్ గురించి తెలుసా.!
మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here