BSNL యూజర్లకు అందుబాటులో ఉన్న గొప్ప వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి వివరించనున్నాము. 2025 కొత్త సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ ధరలో కూడా వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే 2 వేల కంటే తక్కువ ఖర్చుతో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు ఈ ప్లాన్ అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ మూడు వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. వీటిలో రూ. 1,999 తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు యూజర్లకు ఆల్ రౌండ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు క్రింద చూడవచ్చు.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో పూర్తి వ్యాలిడిటీ కాలానికి 600GB ల హై స్పీడ్ డేటా తీసుకు వస్తుంది. అంటే, మొత్తం డేటాని రోజువారీగా విభజిస్తే రోజుకు రోజుకు 1.64GB అవుతుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్, కాలింగ్, డేటా మరియు SMS వంటి పూర్తి ప్రయోజనాలు అందిస్తుంది.
మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here