BSNL: 2025 లో బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్.!
టెలికాం ఇండస్ట్రీ మొత్తం మీద అత్యంత చౌక ప్రీపెయిడ్ ప్లాన్
కేవలం 100 రూపాయల ఖర్చుతో కాలింగ్, డేటా మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలు అందిస్తుంది
చౌక ధరలో సంవత్సర మొత్తం చెల్లుబాటయ్యే బిఎస్ఎన్ఎల్ ప్లాన్
BSNL : టెలికాం ఇండస్ట్రీ మొత్తం మీద అత్యంత చౌక ధరలో ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్న ఏకైక టెలికాం బిఎస్ఎన్ఎల్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే, మరింత చౌక ధరలో సంవత్సర మొత్తం చెల్లుబాటయ్యే బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఒక ప్లాన్ ఉందని మీకు తెలుసా?. ఈరోజు 2025 లో బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ గురించి ఈరోజు చూడనున్నాము.
BSNL బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న అన్ని వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్లలో కూడా రూ. 1,198 రూపాయల వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్, బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రిపేర్ ప్లాన్ నెలకు కేవలం 100 రూపాయల ఖర్చుతో కాలింగ్, డేటా మరియు ఎస్ఎంఎస్ వంటి అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అంటే అందిస్తున్న అన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
BSNL రూ. 1,198 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా సంవత్సరం చెల్లుబాటు అవుతుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే ప్రయోజనాలు మాత్రం నెలవారీగా అందిస్తుంది.
ఈ బిఎస్ఎన్ఎల్ వన్ ఇయర్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు నెలకు 300 మినిట్స్ కాలింగ్, 3GB డేటా మరియు 30 SMS లను అందిస్తుంది. ఈ విధంగా 12 నెల పాటు అందిస్తుంది. నార్మల్ కాలింగ్ మరియు డేటా మాత్రమే అవసరమయ్యే యూజర్లకు ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలు సరిపోతాయి.
ఈ ప్లాన్ ఉచిత ప్రయోజనాలు ముగిసిన తర్వాత లోకల్ కాల్ కోసం నిమిషానికి రూ.1, STD కాల్ కోసం లోకల్ కాల్ కోసం నిమిషానికి రూ.1.30 పైసలు, లోకల్ SMS కోసం 80 పైసలు, నేషనల్ SMS కోసం 1.20 పైసలు మరియు 1MB డేటా కోసం 25 పైసలు ఛార్జ్ చేస్తుంది.
Also Read: POCO X7 5G స్మార్ట్ ఫోన్ ను 1.5K 3D కర్వ్డ్ డిస్ప్లేతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన పోకో.!
మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here