ప్రస్తుతం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ను కలిగివున్న టెలికంగా BSNL నిలుస్తుంది. ఎందకంటే, బిఎస్ఎన్ఎల్ యొక్క కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ నమ్మశక్యం కానీ ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఒక ప్లాన్ నామమాత్రపు ధరకే 10 నెలల వ్యాలిడిటీని అఫర్ చేస్తే, మరొక ప్లాన్ కేవలం 106 రూపాయలకే 85 రోజుల వ్యాలిడిటీని డేటా మరియు లిమిటెడ్ మినిట్స్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా అఫర్ చేస్తోంది.అందుకే, BSNL అందించిన ఆ బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ ఇన్ కమింగ్ కోసం తమ నంబర్ ఉపయోగించే వారికీ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, ఇంత తక్కువ ఖర్చుతో మీరు 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీని అందుకోవచ్చు. అధనంగా, మీరు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.
BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీడీటీ మాత్రం 150 రోజులకు వర్తిస్తుంది.
BSNL యొక్క రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 85 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.
BSNL యొక్క రూ.499 STV ప్లాన్ మాత్రం పూర్తి అన్లిమిటెడ్ ప్రయోజాలను కోరుకునే వారికి సరిపోతుంది. ఈ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.
BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here