BSNL: నెలకు రూ. 100 ఖర్చుతోనే కాలింగ్ మరియు డేటా అందించే సాటిలేని ప్లాన్ ఇదే.!

BSNL: నెలకు రూ. 100 ఖర్చుతోనే కాలింగ్ మరియు డేటా అందించే సాటిలేని ప్లాన్ ఇదే.!
HIGHLIGHTS

ఒక బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ సాటిలేని ప్లాన్ గా చెప్పడుతుంది

రూ. 100 కంటే తక్కువ ఖర్చుతోనే కాలింగ్ డేటా మరియు మరిన్ని లాభాలు అందిస్తుంది

బిఎస్ఎన్ఎల్ మరింత వేగంగా యూజర్లను కూడా ఆకర్షిస్తోంది

BSNL: దేశంలో టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత కూడా ఒక బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ సాటిలేని ప్లాన్ గా చెప్పడుతుంది. అది కూడా కేవలం రూ. 100 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే కాలింగ్ డేటా మరియు మరిన్ని లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ టెలికాం ఇండస్ట్రీ మొత్తం లోనే కారు చవకగా లభించే ఏకైక ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4G నెట్ వర్క్ ను విస్తరిస్తున్న బిఎస్ఎన్ఎల్ మరింత వేగంగా యూజర్లను కూడా ఆకర్షిస్తోంది. అందుకే, బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ఈరోజు చూడనున్నాము.

ఏమిటా BSNL బెస్ట్ బడ్జెట్ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1,198 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తాన్ని నెల వారీగా లెక్కిస్తే రూ. 100 రూపాయల కంటే తక్కువ అవుతుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఇంట తక్కువ రేటుకే కాలింగ్, డేటా మరియు మరిన్ని ఇతర లాభాలు అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఈ క్రింద చూడవచ్చు.

Also Read: Realme GT7 Pro ఇండియా యొక్క మొదటి అండర్ వాటర్ కెమెరా మోడ్ ఫోన్ గా వస్తోంది.!

బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే లాభాలు 12 నెలలు సమానంగా అందిస్తుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో ప్రతి నెలా 300 మినిట్స్ వాయిస్ కాలింగ్ అందిస్తుంది మరియు నెలకు 3GB డేటా కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో నెలకు 30 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది.

BSNL best budget prepaid Plan

పైన తెలిపిన ప్రయోజనాలు 12 నెలలు అందిస్తుంది. ఈ ప్రయోజనాలు ముగిసిన తర్వాత రెగ్యులర్ ఛార్జ్ లు వర్తిస్తాయి. ఈ ప్లాన్ ఫ్రీ బైస్ తర్వాత లోకల్ కాల్ కి రూ. 1, STD కాల్ కి రూ. 1.30 పైసలు, లోకల్ SMS కి 80 పైసలు మరియు నేషనల్ SMS కి 1.20 పైసలు ఛార్జ్ వర్తిస్తాయి. అలాగే, 1MB డేటా కోసం 25 పైసలు ఛార్జ్ వసూలు చేస్తుంది.

మరిన్ని BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo