BSNL భారత్ ఫైబర్ ప్లాన్స్ విడుదల : 50 Mbps రూ. 777 మరియు 100 Mbps రూ. 1,277 ధరతో ప్రారంభమవుతాయి
ఈ కొత్త సర్వీసుతో రోజుకు రూ. 1.1 కంటే తక్కువ ధరతో రోజుకు 35 జిబి డేటాను అందిస్తామని టెలికాం తెలిపింది.
ముఖ్యాంశాలు:
1. BSNL తన కొత్త FTTH సర్వీసు ప్రకటించింది దీనిని "భారత్ ఫైబర్" అని చెబుతోంది.
2. ఈ కొత్త సర్వీసుతో రోజుకు రూ. 1.1 కంటే తక్కువ ధరతో రోజుకు 35 జిబి డేటాను అందిస్తామని టెలికాం తెలిపింది.
3. ఈ కొత్త సర్వీస్ యొక్క బుకింగ్ కంపెనీ వెబ్ సైట్ లో ఇప్పుడు అందుబటులోవుంచింది.
బిఎస్ఎన్ఎల్ తన బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ సర్వీసును ప్రకటించింది, ఈ సర్వీసును వినియోగదారులకు ఒక ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) ఇంటర్నెట్ సర్వీసుగా అందిస్తోంది . జియో జిగాఫైబర్, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ వంటి వాటికీ గట్టి పోటీనిచ్చేలా, రోజుకు 35GB డేటాని ఇస్తుంది మరియు ఇది 1GB కోసం దాదాపుగా రూ.1.1 గా ఉంటుంది. ఈ కొత్త సేవ పైన తమ ఆసక్తిని వ్యక్తం చేయదలచినవారు, బిఎస్ఎన్ఎల్ యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా భారత్ ఫైబర్ కోసం బుకింగులను చేయవచ్చు. ఈ కొత్త సర్వీస్ యొక్క లక్ష్యం దేశంలోని ప్రతి ఇంటికి "ఇంటర్నెట్ను" అందించడమే అని చెబుతోంది.
బిఎస్ఎన్ఎల్, ఇప్పుడు కేబుల్ కి బదులుగా, ఫైబర్ పైన ఇంటర్నెట్ సేవలను అందిస్తోందని ప్రకటించింది, మరియు దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో తన ఇంటర్నెట్ సేవలను విస్తరించింది. ఈ టెలీకో తన వెబ్సైట్లో ప్రస్తావించిన ప్రకారం, ఇది ప్రస్తుత FTTH ప్రణాళికలను ఉపయోగిస్తున్నందున, ఇందులో క్రొత్త ప్రణాళికలు లేవు. ఈ ప్రకటనను, ఆరవ వార్షిక మరియు వార్షిక బ్రాడ్బ్యాండ్ ప్రణాళికల్లో 25 శాతం క్యాష్ బ్యాక్ ని ప్రకటించిన వెంటనే, ఈ ప్రభుత్వ రంగ టెలికాం ప్రకటించింది.
"వినియోగదారులు ఇప్పుడు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కోసం డిమాండ్ చేస్తున్నారని మరియు మరింత ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మరియు వినోద ఉపకరణాలను కలిగి ఉండటం ప్రారంభించారాని మేము గుర్తించాము" అని BSNL బోర్డు యొక్క CFA డైరెక్టర్ అయినటువంటి, వివేక్ బన్జల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. "మా ఫైబర్ ఫర్ హోమ్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయబడింది మరియు భారత్ ఫైబర్ పేరుతొ దీన్ని ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము, ఇది మా వినియోగదారుల భారీ డేటా డిమాండును పూరించగల మంచి అవకాశంగా ఉంటుంది." అని "భారత్ ఫైబర్ బుకింగ్స్ ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ పోర్టల్ లో ప్రారంభించబడ్డాయి. అలాగే, జాతీయ మిషన్ అయినటువంటి డిజిటల్ ఇండియా వలెనే, మా సాంకేతిక పరిజ్ఞానం కూడా అత్యుత్తమంగా ఉంటుంది మరియు మన దేశం యొక్క ప్రతి ఇంటిలో ఇది అందుబాటులో ఉండేలా అన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాము. " అని పై మాటలకి జతచేసారు, బన్జల్.
పైన చెప్పినట్లుగా, ఈ కొత్త సర్వీసు తమ సొంత ఇంటర్నెట్ సేవలను అందించే జీయో మరియు ఎయిర్టెల్ సమర్పణలకు వ్యతిరేకంగా వెళ్తుంది. జీయో యొక్క GigaFiber ఇంటర్నెట్ సేవ, ప్రస్తుతం ఈ సేవ కోసం ఎక్కువ మంది తమ ఆసక్తిని వ్యక్తం చేసిన ప్రాంతాన్ని బట్టి ఎంపిక చేసిన వారికీ మాత్రమే అందిచబడుతుంది. అయితే, Jio GigaFiber అందరికీ అందుబాటులోకి ఎప్పుడు వస్తుందనే విషయం పైన ఎటువంటి ఖచ్చితమైన టైమ్ లైన్ లేదు.