BSNL రూ. 599 ప్లానుతో 6 నెలలు అన్లిమిటెడ్ కాలింగ్ : AP మరియు తెలంగాణ సర్కిళ్లకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటు

BSNL రూ. 599 ప్లానుతో 6 నెలలు అన్లిమిటెడ్ కాలింగ్ : AP మరియు తెలంగాణ సర్కిళ్లకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటు
HIGHLIGHTS

ఒక నెలకు 100 రూపాయలు మాత్రమే అవుతుంది.

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయినటువంటి BSNL ఇప్పుడు దూకుడుమీదున్నట్లు అనిపిస్తోంది. ఒక పక్క ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటూనే, తన సర్వీసులకు సంబంధించిన అనేక ప్రణాలికను సిద్ధం చేయడంతో పాటుగా అందుబాటులో ఉన్నటువంటి ప్రీపెయిడ్ ప్లాన్ల పైన కూడా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా, ఒక సరికొత్త రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రకటించింది. ఇది వ్యాలిడిటీ ని పెంచుకునేందుకు ఉపాయోగపడేలా అందించింది. అంటే, ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క అన్ని సౌలభ్యాలను, ఎక్కువ రోజులకు పెంచుకోవచ్చన్నమాట.               

BSNL తన వినియోగధారులకి  మంచి ప్రయోజాన్ని అందించడం కోసం తీసుకొచ్చిన ఈ రూ. 599 ప్రీపెయిడ్ ప్లానుతో ప్రస్తుతం వారు వాడుతున్నప్రీపెయిడ్ ప్రణాళిక యొక్క వ్యాలిడిటీని,  ఇప్పుడు 6 నెలల వరకూ పెంచుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటికే ఈ ప్లాన్ వాడుతున్నట్లయితే, మీకు కూడా ఇది వర్తిస్తుంది. ఆరునెలలకు గాను రూ. 599 ధరతో వుండే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను గనుక నెలకు విభజించి చూస్తే, ఒక నెలకు కేవలం 100 రూపాయలు మాత్రమే అవుతుంది.

అలాగే, BSNL రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఇప్పుడు డబుల్ డేటాని కూడా అందిస్తోంది. ముందుగా, ఈ రూ.899 ప్రణాళిక కింద, BSNL రోమింగుతో సహా అపరిమిత స్థానిక మరియు ఎస్టీడీ కాల్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ రోమింగ్ పరిస్థితుల్లో ఢిల్లీ మరియు ముంబై తప్ప మిగిలిన ఇతర అన్ని సర్కిళ్లలో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ రూ.899 ప్రీపెయిడ్ ప్లానుతో, రోజువారి 1.5 GB డేటా వినియోగదారులకి లభిస్తుంది. అలాగే, ఈ పూర్తి వ్యాలిడిటీకి గాను అన్లిమిటెడ్ SMS (రోజుకు 50 మాత్రమే) వంటి ప్రయోజనాన్ని కూడా అందించింది. 

అయితే, ఇప్పుడు ఈ రూ. 899 ప్లాన్ పైన 1.7 GB అధిక డేటాని ఉచితంగా అందిస్తోంది BSNL టెలికం సంస్థ. ఈ ప్లాన్ ద్వారా ఇప్పుడు వినియోగదారులు, రోజువారీ 3.2GB దాటని అందుకుంటారు. అంటే, ఇంతకముందు పూర్తి వ్యాలిడిటీకి గాను మొత్తంగా 270GB డేటాని అందిస్తుండగా ఇప్పుడు మొత్తంగా 576GB డేటాని అందిస్తుంది తన వినియోగదారులకి.   

BSNL యొక్క ఈ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్, పూర్తిగా 180 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోమింగ్ తో సహా అపరిమిత కాలింగ్ మరియు రోజువారీ 50 SMS మరియు రోజు వారి 3.2GB డేటా ప్రయోజనాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు వినియోగదారులకి.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo