ప్రభుత్వరంగ టెలికం సంస్థ అయినటువంటి BSNL, ఇప్పుడు మరింత దూకుడు మీదున్నట్లు తెలుస్తోంది. 4G సేవలను అందించడంలో అందరికంటే వెనుక బడినా కానీ, బెస్ట్ ఆఫర్లను అందించడంలో మాత్రం అందరికంటే ముందు స్థానంలో నిలచింది. ఇప్పటికే చాల ప్రాంతాల్లో తన 4G నెట్వర్క్ సేవలను ప్రారంభించిన BSNL సంస్థ, వినియోగదారులకు తీపికబురును అందించింది. ఇప్పుడు కొత్తగా తన 4G STV ప్లాన్స్ లో రెండు కొత్త డేటా ప్లాన్స్ ని అందించింది. ఇవి 96 మరియు 236 రూపాయల ధరతో ఉంటాయి. ఈ రెండు STV ప్లాన్స్ కూడా రోజుకు ఏకంగా 10GB 4G డేటా ని తీసుకువస్తాయి.
ఈ నివేదికను ముందుగా టెలికం టాక్ అందించింది. ఈ నివేదిక ప్రకారం, ముందుగా STV 96 ప్లాన్ గురించి మాట్లాడితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 4G నెట్వర్క్ పరిధిలోని వినియోగదారుల కోసం మాత్రమే అందించింది. ఈ ప్లానుతో రోజుకు 10GB హై స్పీడ్ 4G డేటాని అందుకుంటారు. అయితే, ఈ ప్లాన్ తో పాటుగా కాలింగ్ మరియు SMS వంటి ప్రయోజనాలను మాత్రం ఇవ్వడంలేదు. అధనంగా, ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే, రోజుకు 10GB చొప్పున 28 రోజులకు గాను 280GB ల హై స్పీడ్ డేటాని వినియోగదారులు అందుకుంటారు.
ఇక మరొక STV ప్రీపెయిడ్ ప్లాన్ అయినటువంటి 236 రూపాయల ప్లాన్ గురించి చూస్తే, ఇది కూడా 96 రూపాయల ప్లాన్ మాదిరిగానే ఉంటుంది. అంటే, రోజుకు 10GB హై స్పీడ్ దాటని అందిస్తుంది. అయితే, ఇది 84 రోజుల చెల్లుబాటుకాలంతో వస్తుంది. అంటే, 84 రోజులకు గాను 840GB ల హై స్పీడ్ డేటాని అందుకోవచ్చు. ఇక అన్ని ప్రధాన టెలికం సంస్థలు అందిస్తున్న 4GB డేటా ప్లాన్స్ తో పోల్చి చూస్తే BSNL యొక్క ఈ డేటా STV ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉత్తమమైనవిగా నిలవడం ఖాయం.