BSNL వినియోగదారులకు ఉచిత వ్యాలిడిటీ
కొత్త ఉచిత అఫర్ ప్రకటించింది.
ప్రభుత్వ తేలిక సంస్థ అయినటువంటి, భరత్ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్లకు భారీ నజరాణాను ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో భాగంగా ఇండియాలో లాక్ డౌన్ కాలం మరికొన్ని రోజులు పొడిగించబడింది. మే 3 వతేది వరకూ లాక్ డౌన్ ని పొడిగించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే, ప్రయివేట్ టెలికం సంస్థలు తమ వినియోగదారుల వ్యాలిడిటీ కాలాన్ని మే 3 వతేది వరకూ పెంచినట్లు ప్రకటించాయి.
అయితే, BSNL మాత్రం వచ్చేనెల అంటే మే 5 వతేది వరకూ వినియోధారులకు ఉచిత వ్యాలిడిటీ కాలనీ పొడిగించినట్లు ప్రకటిన్నట్లు, TelecomTalk నివేదించింది. ఈ నివేదిక ప్రకారం,ప్రస్తుత పరిస్థుల కరంగా లాక్ డౌన్ మరొకసారి పొడిగిచబడింది మరియు గతంలో ప్రకటించిన ఏప్రిల్ 20 వరకూ గల ఉచిత వ్యాలిడిటీ కాలాన్ని మే నెల 5వతేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
అంతేకాదు, దీనితో పాటుగా BSNL సంస్థ కొత్తగా Toll Free Recharge నంబర్ ను కూడా ప్రకటించినట్లు చెబుతోంది. వాస్తవానికి, ఈ టోల్ ఫ్రీ రీఛార్జ్ నంబర్ నార్త్ మరియు వెస్ట్ జోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. అయితే, ఈ టోల్ ఫ్రీ నంబర్ ఇప్పుడు సౌత్ మరియు ఈస్ట్ జోన్లలో కూడా ఏప్రిల్ 22 వతేది నుండి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ నంబర్ మీకు ఇంట్లో కూర్చునే మీ BSNL ని రీఛార్జ్ చేసేందుకు సహాయపడుతుంది.