BSNL 5G: దేశంలో 5G నెట్ వర్క్ విస్తరించే దిశగా అడుగులు వేస్తున్న బిఎస్ఎన్ఎల్.!

Updated on 06-Aug-2024
HIGHLIGHTS

దేశంలో 5G నెట్ వర్క్ విస్తరించే దిశగా బిఎస్ఎన్ఎల్ అడుగులు

టారిఫ్ ఛార్జ్ లతో విసిగి వేసారిన కస్టమర్లకు మంచి శుభవార్త

బిఎస్ఎన్ఎల్ 5G తీసుకు వస్తుందనే ప్రకటనతో టెలికాం రంగంలో ప్రకంనలు మొదలయ్యాయి

BSNL 5G: దేశంలో 5G నెట్ వర్క్ విస్తరించే దిశగా అడుగులు వేస్తున్న బిఎస్ఎన్ఎల్, ఇప్పటికే 5G నెట్వర్క్ పైన 5జి వీడియో కాల్ ను కూడా టెస్ట్ చేసింది. దేశంలో పెరిగిన టారిఫ్ ఛార్జ్ లతో విసిగి వేసారిన కస్టమర్లకు ఇది మంచి శుభవార్త అవుతుంది. కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే దేశంలో ఇప్పటికీ చాలా సరసమైన ధరలకే ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. అయితే, నెట్ వర్క్ సమస్య కారణంగా బిఎస్ఎన్ఎల్ నుండి వలసలు ఎక్కువగా జరిగాయి. అయితే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ 5G తీసుకు వస్తుందనే ప్రకటనతో టెలికాం రంగంలో ప్రకంనలు మొదలయ్యాయి.

BSNL 5G:

యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల బిఎస్ఎన్ఎల్ 5G నెట్ వర్క్ పైన మొదటి వీడియో కాల్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ చర్య తర్వాత బిఎస్ఎన్ఎల్ 5G నెట్ వర్క్ పైన చర్చ ఎక్కువయ్యింది. ఇది మాత్రమే కాదు ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన బిఎస్ఎన్ఎల్ 5G సిమ్ కార్డు సెల్లింగ్ వైరల్ వీడియో కూడా బిఎస్ఎన్ఎల్ 5G పైన చర్చ తారాస్థాయికి చేరడానికి కారణం అయ్యింది.

ఈ వైరల్ వీడియో అశోక్ దనొడా అనే అకౌంట్ నుంచి షేర్ అయ్యింది. ఈ వీడియో లో బిఎస్ఎన్ఎల్ 5G సిం కార్డ్ లాంచ్ చేసినట్లు మరియు అమ్మకాలకు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, బిఎస్ఎన్ఎల్ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఇంకా రాలేదు.

Also Read: Amazon GFF Sale 2024: లేటెస్ట్ Sony స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

అయితే, నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న కొత్త నివేదికలు మరియు లీక్స్ ద్వారా బిఎస్ఎన్ఎల్ అతి త్వరలో 5G సేవలను దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. అంతేకాదు, బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ ముందుగా ఏ ప్రఙతల్లో వస్తుంది ని కూడా కొన్ని నివేదికలు అంచనా వేసి వెల్లడిస్తున్నాయి. ఇందులో, ఢిల్లీ లోని కన్నాట్ ప్లేస్, హైదరాబాద్ IIT ఏరియా, ఢిల్లీ సంచార్ భవన్ వంటి మరిన్ని ప్లేస్ లు వున్నాయి.

మరి నివేదికలు చెబుతున్న మాటల్లో ఎంత వరకు నిజం ఉన్నదో వేచి చూడాలి. ఇదే కనుక నిజం అయితే, మొబైల్ రీఛార్జ్ కోసం అధిక ఖర్చు చేయాల్సిన బాధనుండి విముక్తి కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :