ప్రస్తుతం 4G యుగం కొనసాగుతుంది టెలికం మార్కెట్లో. అయితే, గత రెండు సంవత్సరాలుగా ఈ సేవలను అందించడంలో వెనుకబడివున్న ప్రభుత్వ రంగ తెలికం సంస్థ అయినటువంటి భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) ఎట్టకేలకు తన 4G VoLTE సేవలను ఇప్పుడు వినియోగదారులకి అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి, విజయవాడ పరిధిలోని నున్నాలో, BSNL మొట్టమొదటి 4G టవర్ ని నిర్మించింది. అయితే, BSNL యొక్క 4G సర్వీసును గురించి వివరించే పైలెట్ ప్రాజెక్టును మాత్రం కేరళ రాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లాలో చేపట్టింది.
ముందుగా Telicom Talk అందించిన వివరాల ప్రకారం, ఇప్పుడు గుజరాత్ మరియు మరికొన్ని సర్కిళ్లలో తమ 4G VoLTE సర్వీసును మొదలుపెట్టినట్లు, BSNL తెలియచేసింది. అయితే, ప్రస్తుతానికి 4G నెట్వర్క్ రిలే కోసం 3G యొక్క వాయు తరంగాలనే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనవరిలో BSNL యూక ప్రకటనలను ఒకసారి తిరిగి పరిశీలిస్తే, చెన్నై లో BSNL యొక్క 4G SIM అప్డేట్ చేసుకునవారికి 2GB ఉచిత డేటా ని కూడా అందించిన విషయం మనకు తెలుసు.
అయితే, ప్రస్తుతం తన 3G నెట్వర్క్ లో అన్నింటి టెలికం కంపెనీల కంటే కూడా ఉత్తమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అఫర్ చేస్తోంది. అలాగే, తెలుగు రాష్ట్రాలతో సహా కొన్నిసర్కిళ్లలో కొన్ని ప్రీపెయిడ్ ప్రణాళికల పైన ఆత్యదికంగా, రోజుకు 2GB డేటాని ఉచితంగా అందిస్తోంది. ఇంకా కొత్త రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 6 నెలల అన్లిమిటెడ్ కాలింగ్ వాటి ఉత్తమైన ప్లాన్లను కూడా పరిచయం చేసింది. ఇక 4G సర్వీస్ ప్రారంభమైనది కాబట్టి ఎటువంటి ఉత్తమ ప్లాన్స్ తీసుకువస్తుందో చూడడానికి మరి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది.