తెలంగాణాలో త్వరలోనే BSNL 4G సర్వీసులు ప్రారంభంకానున్నాయి :నివేదికలు

Updated on 03-Oct-2018
HIGHLIGHTS

తొలుత పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా రెండు జిల్లాలలో ప్రారంభించనున్నారు. మార్చి 2019 నాటికీ స్టేట్ మొత్తం అందే అవకాశం.

BSNL ఈ ప్రభుత్వ రంగ సంస్థ , 4G సేవలను అందుంచే దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం, తెలంగాణ స్టేట్ లో తన 4G సేవలను విస్తరించే దశలో భాగంగా ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ లను చేపట్టనుందని, ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ద్వారా వెల్లడైనది.

ముందుగా, ఈ 4G సర్వీసులను పరీక్షించడం కోసం దీని పైలెట్ ప్రొజెట్ ను మహబూబ్ నగర్ జిల్లాలోని జెడ్చెర్ల టౌన్ మరియు కమ్మం జిల్లాలోని వైరా టౌన్ లలో ప్రారంభించనున్నట్లు  BSNL యొక్క తెలంగాణా టెలికామ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అయిన, వి. సుందర్ తెలిపినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ ప్రాజెక్టులను, నవంబర్ నెలలో ప్రారంభించనున్నారు, అలాగే ఈ సేవలను ఈ సంవత్సరాంతానికల్లా మిగిలిన జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా విస్తరిస్తామని, సుందర్ తెలియచేసారు.ముగింపు వివరణ ఇస్తూ " 2019 మార్చి , నాటికీ దాదాపుగా 8-9 లక్షల కొత్త చందాదారుల్ని సొంతం చేసుకుంటామని " అయన పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :