దేశవ్యాప్తంగా BSNL 4G సర్వీస్ లు వేగంగా విస్తరిస్తున్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద పట్టణమైన విశాఖపట్నంలో బిఎస్ఎన్ఎల్ 4G సర్వీస్ లను ప్రారంభించింది. ఈ సర్వీస్ లను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) లో ఆరంభించింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగల ఏకైక టెలికాం గా కొనసాగుతున్న బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పరంగా ఇప్పటి వరకు నెగిటివ్ ను మూటగట్టుకుంది. అయితే, ఇప్పుడు దేశం మొత్తం కూడా 4G నెట్ వర్క్ ను విస్తరిస్తూ ఆ విషయంలో కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) లో బిఎస్ఎన్ఎల్ 4G సర్వీస్ ను లాంచ్ చేశారు. ఈ సర్వీస్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లోని రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఏరియా, RINL అడ్మినిస్ట్రేటివ్ ఏరియా మరియు ప్లాంట్ ఏరియా లలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి, బిఎస్ఎన్ఎల్ 4G సర్వీస్ మొత్తం ఉక్కు నగరానికి అందుబాటులోకి వస్తుంది.
బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసులను ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అందించిన టెక్నాలజీతో సాధ్యం అయ్యింది, అని విశాఖపట్నం జిల్లా టెలికాం ప్రిన్సిపల్ GM, పాల్ విలియం ఈ లాంచ్ ఈవెంట్ లో తెలిపారు.
Also Read: భారీ డిస్కౌంట్ తో QLED Smart Tv బెస్ట్ ఆఫర్ అందించిన అమెజాన్.!
ప్రైవేటు కంపెనీలు తమ టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత యావత్ దేశం చూపు బిఎస్ఎన్ఎల్ పైపు మళ్లింది. ఎందుకంటే, నామ మాత్రపు రేట్లకు సర్వీస్ ను అందిస్తున్న టెలికాం కంపెనీగా ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ మాత్రమే నిలబడింది. అందుకే, మొబైల్ యూజర్లు ఎక్కువగా బిఎస్ఎన్ఎల్ కు వలస వెళుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
దీనికి అనుగుణంగా నెట్ వర్క్ పరిధిని మరింత విస్తరించడానికి బిఎస్ఎన్ఎల్ మరియు ప్రభుత్వం చొరవ చూపుతున్నాయి. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల బిఎస్ఎన్ఎల్ 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి మరియు బిఎస్ఎన్ఎల్ మరింత వేగంగా ఈ నెట్ వర్క్ ను విస్తరిస్తోంది. అంతేకాదు, ఇటీవల బిఎస్ఎన్ఎల్ 5G పైన వీడియో కాల్ ను నిర్వహించడం మరియు బిఎస్ఎన్ఎల్ 5జి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా చేస్తోంది.
బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు రీఛార్జ్ చేయడానికి Click Here