BSNL 4G నెట్ వర్క్ పై సెటైర్స్ మరియు కామెంట్స్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వ టెలికాం సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తంగా 15,000 ఏరియాల్లో 4G నెట్ వర్క్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ టెలికాం తెలిపింది. జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఫోన్ ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ రేట్లు పెరగడంతో బిఎస్ఎన్ఎల్ కి వలసలు పెరగడంతో ప్రభుత్వ టెలికాం వేగంగా 4G నెట్ వర్క్ ను విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది
పెరిగిన టారిఫ్ రేట్ దెబ్బకి అసహనానికి గురైన యూజర్లు బిఎస్ఎన్ఎల్ కి వలసలు మొదలు పెట్టారు. అయితే, బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పైన ఉన్న అపోహలు మరియు అనుమానాలు కొంత అనిశ్చితికి కారణం అవుతున్నాయి. అయితే, దేశంలో ఇప్పటికే 15,000 ఏరియాల్లో 4G నెట్ వర్క్ ఏర్పాటు చేయడమే కాకుండా సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు కొత్త అప్డేట్ ప్రకటించి వీటన్నిటి చెక్ పెట్టింది.
బిఎస్ఎన్ఎల్ యొక్క అధికారిక X (ట్విట్టర్) అకౌంట్ నుంచి ఈ కొత్త అప్డేట్ ను షేర్ చేసింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో దేశంలో 15,000 కు పైగా ఏరియాలలో 4G నెట్ వర్క్ ను ప్రవేశపెట్టినట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ‘4G For Every Indian’ అనే ట్యాగ్ లైన్ తో ఈ కొత్త పోస్ట్ ను షేర్ చేసింది. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
Also Read : Myntra Deals: మంచి డిస్కౌంట్ తో రూ. 1,000 ధరలో లభిస్తున్న బెస్ట్ TWS Buds డీల్స్.!
ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత బిఎస్ఎన్ఎల్ మాత్రమే బడ్జెట్ రేటు ధరలో ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీగా నిలిచింది. బిఎస్ఎన్ఎల్ నామమాత్రపు రేట్లకే అన్ని లాభాలను అందించే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ లను సైతం అందిస్తోంది. అందుకే, ప్రజల చూపు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లినట్లు మనం భావించవచ్చు.
మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here