BSNL 4G: దేశవ్యాప్తంగా 4G సేవలు..పనులు వేగవంతం చేసిన కేంద్రం.!

BSNL 4G: దేశవ్యాప్తంగా 4G సేవలు..పనులు వేగవంతం చేసిన కేంద్రం.!
HIGHLIGHTS

BSNL 4G నెట్ వర్క్ పైన కొత్త అప్డేట్

దేశవ్యాప్తంగా 4G సేవలను అందించే దిశగా BSNL

4G సర్వీస్ కోసం పనులను వేగవంతం చేసిన కేంద్ర

ప్రభుత్వ టెలికం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) 4G సేవలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి వేగంగా పనిలో సాగుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 4G సేవలు అంధుబాటులోకి రాగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా 4G సేవలను అందించే దిశగా సాగుతోంది. మినిష్టర్ ఆఫ్ స్టేట్స్ ఫర్ కమ్యూనికేషన్స్, దేవుసిన్హ్ చౌహన్ వెల్లడించారు. 

BSNL 4G సర్వీస్ ల కోసం ఎదురు చూస్తున్న యూజర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే,దేశంలో అత్యంత చవక ధరకే ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్స్ అందిస్తున్న టెలికం కంపెనీగా BSNL నిలిచింది. అయితే, నెట్ వర్క్ మరియు డేటా స్పీడ్ పరంగా యూజర్లు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే, దేశ వ్యాప్తంగా 4G సేవలు అందుబాటులోకి వస్తే వేగవతమైన ఇంటర్నెట్ మరియు అంతరాయం లేని కాలింగ్ సౌలబ్యాన్ని యూజర్లు ఆస్వాదించే అవకాశం దక్కుతుంది. 

ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే, బిఎస్ఎన్ఎల్ 4G సర్వీస్ కోసం దేశవ్యాప్యంగా పనులను వేగవంతం చేసినట్లు కేంద్ర తెలిపింది. అంతేకాదు,  ఒక లక్షకు పైగా బిఎస్ఎన్ఎల్ 4G సైట్స్ కి కూడా ఆమోదం తెలిపినట్లు కూడా తెలిపారు. దీని సంభందించి కొత్త అప్డేట్స్ మనం త్వరలోనే అందుకునే ఆస్కారం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo