Jio రీఛార్జ్ ప్లాన్ రేట్లు రేపటి నుంచి మారబోతున్నాయి. ఇప్పటికే వరకూ ఒక లెక్క ఇక్కడ నుండి ఒక లెక్క అనే తీరుగా జియో రీఛార్జ్ రేట్లు మారనున్నాయి. అయితే, తక్కువ ధరలో లభించే రిలయన్స్ బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ను ఈరోజు కూడా రీఛార్జ్ చేసే అవకాశం వుంది. చాలా తక్కువ ధరలో దాదాపు వన్ ఇయర్ వ్యాలిడిటీ అందించే ప్లాన్ ను రీఛార్జ్ చేసే అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే వుంది. అయితే, ఈ ప్లాన్ ను నేరుగా రీఛార్జ్ చేసే అవకాశం లేదు.
వాస్తవానికి, రిలయన్స్ యొక్క రూ. 1559 ప్లాన్ ను నేరుగా రీఛార్జ్ చేసే అవకాశం లేదు. గతంలో ఈ ప్లాన్ రీఛార్జ్ ప్లాన్స్ లిస్ట్ లో నేరుగా అందుబాటులో ఉండేది. అయితే, ఇప్పుడు ఈ ప్లాన్ ను రీచార్జ్ చేయాలంటే, ఈ ట్రిక్ తెలిసి ఉండాలి. ఈ ట్రిక్ తో ఈ ప్లాన్ ను ఈరోజు తక్కువ ధరలో అన్ని ప్రయోజనాలతో పొందవచ్చు.
జియో రూ. 1,559 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను రీఛార్జ్ చేయడానికి, ముందుగా jio.com సైట్ లో లాగిన్ అవ్వాలి. దీనికోసం మీ జియో మొబైల్ నెంబర్ ను ఉపయోగించి OTP ని అందుకొని లాగిన్ అవ్వాలి. తర్వాత, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ పేరు మరియు ఇతర వివరాలతో కొత్త పేజీ తెరుచుకుంటుంది. ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. తర్వాత, అకౌంట్ సెట్టింగ్స్ లో క్రింద సర్వీస్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఈ సర్వీస్ సెట్టింగ్స్ లో అన్నింటి కంటే క్రింద టారిఫ్ ప్రొటెక్షన్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఈ టారిఫ్ ప్రొటెక్షన్ ను ఎంచుకోగానే రెండు బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ. 395 మరియు రూ. 1,559 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ లు కనిపిస్తాయి. ఇక్కడ రూ. 1,599 ప్లాన్ ను ఎంచుకొని రీఛార్జ్ చేయొచ్చు. అయితే, ఈ ప్లాన్ పైన ఇప్పటివరకు అన్లిమిటెడ్ 5జి ప్రయోజనాలను జియో అందించేది. కానీ రేపటి నుంచి ఈ ప్లాన్ పైన అన్లిమిటెడ్ 5జి లాభాలు అందుతాయో లేదా అనే విషయం పై క్లారిటీ రావాల్సి వుంది.
Also Read: 24 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో 30 వేలకే బ్రాండెడ్ 5G Flip Phone అందిస్తున్న Amazon.!
ఈ ప్లాన్ కేవలం ఎటువంటి యాక్టివ్ ప్లాన్ లేని జియో కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆల్రెడీ యాక్టివ్ ప్లాన్ రన్నింగ్ లో ఉన్నవారు ఈ రీఛార్జ్ కి అర్హులు కారు అని జియో చెబుతోంది.
ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలను చూస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 24GB డేటా అందిస్తుంది.