ఈ ప్లాన్స్ ఎంచుకుంటే Netflix, Prime Video మరియు డిస్నీ+ హాట్ స్టార్ OTT లు ఉచితంగా చూడవచ్చు.!

Updated on 19-Aug-2022
HIGHLIGHTS

Netflix, Prime Video మరియు Disney+ HotStar ఉచిత సబ్ స్క్రిప్షన్

ఎటువంటి అదనపు ఖర్చు ఉండదు

టెలికం కంపెనీలు OTT లను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్

Netflix, Prime Video మరియు డిస్నీ+ హాట్ స్టార్ OTT సబ్ స్క్రిప్షన్ పొందాలంటే డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అయితే, జియో, ఎయిర్టెల్ మరియు Vi వంటి ప్రధాన టెలికం సంస్థలు వారి ప్లాన్ లతో అనేక OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అఫర్ చేస్తున్నాయి. అంటే, ఈ టెలికం కంపెనీలు అఫర్ చేసే ఈ బెస్ట్ ప్లాన్లను ఎంచుకునే వారు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా Netflix, ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్ స్టార్ OTT లను ఉచిత చూడవచ్చు.

ముఖ్యంగా, జియో యొక్క పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు Netflix, Prime Video మరియు Disney+ HotStar మూడు యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తాయి. ఈ ప్లాన్ లను ఎంచుకునే కస్టమర్లకు Netflix OTT ప్లాట్ ఫామ్ యొక్క ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్స్ కేవలం నెట్ ఫ్లిక్స్ మాత్రమే కాదు, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+హాట్ స్టార్ లకు కూడా ఉచిత యాక్సెస్ ను అందిస్తుంది. మరి జియో కస్టమర్లకు Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ ల ఉచిత యాక్సెస్ అందించే బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా.

జియో అఫర్ చేస్తున్న ఈ ప్లాన్స్ పోస్ట్ పైడ్ ప్లాన్స్ మరియు ప్రయోజనాలు ప్రీపెయిడ్ కస్టమర్లకు వర్తించవు.ఈ ప్లాన్ లను కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుండి ప్రారంభమవుతాయి మరియు ఇది వీటిలో బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ ప్లాన్ అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాబాలాను అందిస్తుంది.

Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.

ఇదే లాభాలను అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడా తీసుకువస్తాయి. అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది. అయితే, ఇక్కడ అందించిన ప్లాన్ ధరలకు GST ని కూడా కలుపుకోవాల్సి వుంటుంది.

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :