ప్రతీ టెలికం కంపెనీ కూడా తన యూజర్లకు అన్ని ధరల్లోనూ తగిన ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి. జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం కంపెనీలు బడ్జెట్ రేటులో మొదలుకొని ప్రీమియం ధర వరకూ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అనేక ప్లాన్స్ ను కలిగివున్నాయి. అయితే, ఈరోజు మనం జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం కంపెనీలు రూ.100 లోపు అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి చుడనున్నాము. కేవలం రూ.100 రూపాయల లోపల కస్టమర్లు వారి టెలికం కంపెనీ నుండి ఎటువంటి లాభాలను అందుకుంటారో చూద్దామా.
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అత్యంత చవకైన ప్లాన్ ను కేవలం రూ.26 రూపాయలకే అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే కస్టమర్లు 2GB డేటాని 28 రోజుల వ్యాలిడిటీతో పొందుతారు. ఇది కాకుండా జియో యొక్క రూ. 62 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా వుంది మరియు ఇది 28 రోజుల చెల్లుబాటుతో 6GB డేటాను అందిస్తుంది.
BSNL యొక్క చౌకైన రీఛార్జ్ ప్లాన్లలో మొదటిది 49 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో 100 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈ ప్లాన్‌ను సెకండరీ SIM కార్డ్ కోసం ఉపయోగించవచ్చు, ఇది మీ ఖర్చులను తగ్గిస్తుంది మరియు మీరు రెండు SIM లను ఉపయోగించవచ్చు.
ఎయిర్టెల్ యొక్క అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, రూ.99. ప్లాన్ గురించి చెప్పొచ్చు. ఈ ప్లాన్ తో కస్టమర్లు 28 రోజుల వ్యాలిడిటీని రూ. 99 టాక్ టైమ్‌ను పొందుతారు. ఈ మొత్తాన్ని యూజర్లు కాల్ చేయడానికి లేదు మెసేజెస్ కోడం కూడా ఉపయోగించవచ్చు. అదనంగా, ఈ ప్లాన్ తో కస్టమర్లు 200 MB డేటాను కూడా పొందుతారు.
వోడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారులకు 98 రూపాయల ధరలో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 15 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 200 MB డేటాను అందిస్తుంది.
మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here