ప్రస్తుతం, టెలికం రంగంలో అన్ని ప్రధాన టెలికం సంస్థలు కూడా తమ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన అనేక మార్పులను చేస్తున్నాయి. ముఖ్యంగా, వినియోగదారులు అధిక డేటాని కోరుకుంటుండడంతో సంస్థలు కూడా అటువైపే మొగ్గుచూపుతున్నాయి. కాబట్టి, తక్కువ ధరలో వినియోగదారులకు ఎక్కువ డేటాని అందించే దిశగా BSNL తన ప్రీపెయిడ్ ప్లాన్లలో గొప్ప మార్పును చేసింది. తద్వారా, కేవలం 96 రూపాయల ధరకే, వినియోగదారులకు రోజుకు 10GB డేటాని అందిస్తోంది. కాబట్టి, ఈ ధరలో ఎయిర్టెల్ మరియు జియో వంటి సంస్థలు అందిస్తున్న ప్రయోజనాలతో పోల్చి చూద్దాం.
BSNL యొక్క STV 96 ప్లాన్ గురించి మాట్లాడితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 4G నెట్వర్క్ పరిధిలోని వినియోగదారుల కోసం మాత్రమే అందించింది. ఈ ప్లానుతో రోజుకు 10GB హై స్పీడ్ 4G డేటాని అందుకుంటారు. అయితే, ఈ ప్లాన్ తో పాటుగా కాలింగ్ మరియు SMS వంటి ప్రయోజనాలను మాత్రం ఇవ్వడంలేదు. అధనంగా, ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే, రోజుకు 10GB చొప్పున 28 రోజులకు గాను 280GB ల హై స్పీడ్ డేటాని వినియోగదారులు అందుకుంటారు. ఎక్కువగా డేటాని కోరుకువారికి ఇది నిజంగా ఒక మహత్తరమైన అవకాశం.
అందరికంటే ముందుగా, జియో తన రూ. 98 ప్లాన్ తో మంచి ప్రయోజనాలను అందించింది. ఎందుకంటే, ఎక్కువగా కాలింగ్ చేసేవారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లానుతో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 300 SMS పరిమితి మరియు 2GB డేటాని అందుకుంటారు వినియోగదారులు. ఈ 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే, ఎక్కువగా డేటా కోరుకునేవారికి ఈ ప్లాన్ కొంత నిరాశపరుస్తుంది. కానీ, కాలింగ్ పైన ఎక్కువగా ఆధార్ పడేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది.
ఇక ఎయిర్టెల్ యొక్క 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఇది కేవలం 6GB డేటాని మాత్రమే అందిస్తుంది మరియు దీనితో మీకు ఎటువంటి కాలింగ్ ప్రయోజనాలు లభించవు. అలాగే, కేవలం 10 నేషనల్ మేమియు లోకల్ SMS సౌలభ్యాన్ని మాత్రమే ఇస్తుంది. ఈ 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.